E-Paper
Advertisement

Vishnu Priya: విష్ణుప్రియా అసలు స్వరూపం ఇదేనా.. ఐటి యాక్ట్ ఉచ్చులో బుల్లితెర బ్యూటీ!

Vishnu Priya: విష్ణుప్రియా అసలు స్వరూపం ఇదేనా.. ఐటి యాక్ట్ ఉచ్చులో బుల్లితెర బ్యూటీ!
Advertisement

Vishnu Priya: డబ్బు కట్టు న్యూడ్ షో చూడు. సెమీ పోర్న్ సైట్స్ గా మారిపోతున్న ఇన్ స్టా వంటి సోషల్ మీడియా సైట్లు. గతంలో లేని సరికొత్త బ్యాడ్ న్యూడ్ కల్చర్. వర్చువల్ వ్యభిచారానికి తెరలేపుతున్న కొందరు భామలు. సబ్ స్క్రిప్షన్ ద్వారా.. న్యూడ్ షో చేస్తూ లక్షలాది రూపాయల సంపాదన. వీటి ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తోంది? ఈ కల్చర్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి విష్ణు ప్రియపై నమోదైన కేసులేంటి? అసలా డీటైల్స్ ఏంటి? హ్యావే లుక్.

అలాంటి విష్ణు ప్రియ..

ఏంటీ వర్చువల్ వరస్ట్ కల్చర్? ఎక్కడిది. బేసిగ్గా ప్రకాశం జిల్లాకు చెందిన విష్ణు ప్రియ భీమనేని, బార్న్ బ్రాటప్ హైదరాబాద్ లోనే సాగింది. ఆమె విద్యాభ్యాసం మాదాపూర్ పరిసరాల్లోనే జరిగినట్టు తెలుస్తోంది.. చిన్నప్పటి నుంచి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడంలో ప్రావీణ్యం పొందింది. పోవే పోరా వంటి షోల ద్వారా బుల్లితెరకు పరిచయమై గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి విష్ణు ప్రియ నేడిలా బరితెగించడంతో ఒక్కసారిగా తెలుగు సమాజం ఉలిక్కి పడింది. ఈ విషయంపై AISF వారు కంప్లయింట్ చేయడంతో అందరి దృష్టీ ఈ అంశంపై పడింది.

ఇందులో తప్పెవరిది?

Advertisement

నిస్సిగ్గుగా అర్ధనగ్న వీడియోలు చూపిస్తాం అని విష్ణు ప్రియ వంటి అమ్మాయిలు అనడమేంటి? అందుకు మగవాళ్లు కూడా ఎగబడ్డమేంటి? ఇది కూడా ఒకరకమైన ప్రాస్టిట్యూషన్ కాదా? మాములుగా వ్యభిచారం నేరమైనపుడు.. ఇది కూడా ఒకరకమైన నేరమే అవుతుంది కదా? అని ప్రశ్నిస్తున్నాయి కొన్ని ప్రజాసంఘాలు. ఇందులో తప్పెవరిది? చూపిస్తానంటోన్న ఆమెదా? లేక చూస్తామంటోన్న వీరిదా? ఇది యువతను పెడతోవ పట్టించడం కాదా? అన్న చర్చకు తెరలేచింది. అసలేంటీ కల్చర్? అంటే దీన్నే అటెన్షన్ ఎకానమీ అంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కమ్ ఫాలోయర్లే కరెన్సీ నోట్లుగా మారిన కొత్త కల్చర్లో ఉన్నాం మనం. అందాన్ని అంగడి సరుకుగా మార్చి.. సోషల్ మీడియా అకౌంట్లో ఆడతనాన్ని అమ్మేస్తున్న సమాజంలో జీవిస్తున్నాం. ఇప్పటి వరకూ ఉన్న దందాల్లోనే ఇది కొత్త రూపంగా అంచనా వేస్తున్నారు.

మానసిక స్థితి ఏంటి?

సబ్‌స్క్రిప్షన్ ఆధారిత యాప్స్ అంటే కొందరికి మాత్రమే ప్రత్యేకమైన ఇలాంటి వాటి ద్వారా నేరుగా కంటెంట్‌ను అమ్ముకునే వీలు కలగడం ఈ ధోరణికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో తప్పెవరిదీ? అని చూస్తే ఇక్కడ ఒకరినే తప్పు పట్టడం సాధ్యం కాని పని. వారు చూపిస్తున్నారు. వీరు చూస్తున్నారంతే. ఇక చూపించే వారి పరిస్థితేంటంటే డబ్బు, గుర్తింపు రాత్రికి రాత్రి సాధించాలనే కోరికతో నైతిక విలువలను పక్కన పెట్టి గ్లామర్ కే ప్రయారిటీ ఇవ్వడం. ఇలాంటి వారి మానసిక స్థితి ఏంటి? అని పరిశీలిస్తే.. నలుగురు మెచ్చుకోవాలి లేదా చూడాలి. తద్వారా మనకు లబ్ధి చేకూరాలి.. అనేది ఒక వ్యసనంగా మారడం. ఇదే తాత్కాలిక లాభం కోసం శాశ్వతంగా గౌరవాన్ని వదులుకోవడంలాంటిదని అంటారు మానసిక వైద్యులు.

ఇదో రకం వాయురిజం..

Advertisement

ఇక చూసేవారి సిట్యువేషనేంటని పరిశీలిస్తే.. అవతలి వారు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అనడం ఒక సాకు మాత్రమే. డిమాండ్ లేకపోతే సప్లై ఉండదు. చూసే వాళ్ళు లేకపోతే ఇలాంటి కంటెంట్‌కు విలువే ఉండదని అంటారు మానసిక నిపుణులు. ఇదో రకం వాయురిజం అంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడ్డం అన్నమాట. ఇతరుల విషయాలపట్ల అవసరానికి మించిన ఆసక్తి కనబరచడం. ఇలాంటివారు నిజజీవితంలో విపరీతమైన ఒంటరితనం లేదా అసంతృప్తి ఉన్నవారిగా చెబుతారు మానసిక వైద్యులు. వీరు వర్చువల్ ప్రపంచంలో సుఖాన్ని వెతుక్కుంటారని ఎనలైజ్ చేస్తారు సైకాలజిస్టులు. ఇది సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్నది కూడా ఒక డిబేటబుల్ పాయింటే. యువత కష్టపడి పని చేయకుండా అడ్డదారిలో డబ్బు సంపాదించడానికిదో అవకాశం అన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇలాంటి కంటెంట్ ద్వారా పురుషులలో మహిళల పట్ల గౌరవాన్ని తగ్గించే అవకాశముందని అంటారు పలువురు సామాజికవేత్తలు. ఇవి నేరుగా లైంగిక దాడులకు కారణం కాకపోయినా.. కొందరి మానసిక స్థితిని మరింత వికృతంగా మార్చేస్తాయని అంటారు నిపుణులు. అంతగా ఈ బ్యాడ్ న్యూడ్ కల్చర్ ఎఫెక్ట్ చూపుతుందని చెప్పుకొస్తారు.

బ్యాడ్ న్యూడ్ కంటెంట్..

ఈ విషయంలో ఎలాంటి చట్టాలు రావాలి? అని ప్రశ్నిస్తే.. ఇప్పటికే ఐటీ యాక్ట్-2000 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేయడం నేరం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇందులోనూ కొన్ని మార్పులు అవసరంగా తెలుస్తోంది. ఓటీటీ, ఇతర సోషల్ మీడియా యాప్స్ లో.. కంటెంట్ నాణ్యతను పర్యవేక్షించే వ్యవస్థ రావల్సి ఉంటుంది. సెల్ఫ్ సెన్సార్ షిప్ అవసరం ఏర్పడుతోంది. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తమకు తాము ఒక కొత్త బాధ్యతను తీసుకోవాలి. ఇలాంటి బ్యాడ్ న్యూడ్ కంటెంట్ ఎంకరేజ్ చేసేవారి పేజీలను బ్లాక్ చేసేలాంటి నిబంధనలు తీసుకురావాలి. అశ్లీలత ద్వారా వచ్చే ఆదాయంపై కఠినతరమైన నిబంధనలు విధించాలి.

విజయవాడలో కంప్లయింట్..

ఇక చట్టాల కంటే సామాజిక స్పృహ ముఖ్యమని చెప్పాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు అనేది ప్రేక్షకులు నిర్ణయించుకున్న రోజున ఇలాంటి కల్చర్ కి ఈజీగా చెక్ పెట్టొచ్చు. సెలబ్రిటీలు కూడా తమకున్న సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక పేరెంట్స్ కూడా పిల్లలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఎలా చెబుతారో.. ఎదిగిన పిల్లల విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఇలాంటి వాటి జోలికి పోకుండా అప్రమత్తం చేయాలి. ప్రస్తుతం విష్ణు ప్రియపై విజయవాడలో కంప్లయింట్ నమోదైంది. ఈ విషయంలో విష్ణుపై విజయవాడ పోలీసుల రియాక్షనేంటి? చూడాలి.

Also Read: మళ్లీ వాయిదా పడనున్న యశ్ టాక్సిక్.. వారితో విభేదాలే కారణమా? ఒక్క మాటతో క్లారిటీ!

Related News

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

Big Stories

Advertisement
×