Toxic Trailer:’కేజీఎఫ్ 2’…కన్నడ ఇండస్ట్రీ రేంజ్‌ను ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌గా మార్చేసిన సినిమా ఇది.అప్పటి వరకు వంద కోట్లయినా వస్తాయా అనుకుంటున్న శాండల్ వుడ్ కి ఏకంగా వెయ్యి కోట్లని పరిచయం చేసిన హీరో రాకింగ్ స్టార్’ యష్ .మరి అలాంటి హీరో నుండి మరో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఏం తొందర లేదు అంటూ చాలా గ్యాప్ తీసుకుని అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ “టాక్సిక్”.
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనౌన్స్ అయిన వెంటనే ట్రేడ్ వర్గాల్లో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చేసుకుంది.అయితే సినిమా ఎప్పుడో కంప్లీట్ అయినా సినిమా ఎప్పుడొస్తుంది,ఇపుడొస్తుంది అంటూ వాయిదాల పాట పాడటమే కానీ ఇప్పటికి వచ్చింది లేదు.ఇక ఇదే క్రమంలో సినిమా నుండి ట్రైలర్ వస్తుందని,అది కూడా వచ్చే ఆగస్టు 8న పక్కా అన్న టాక్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.
వచ్చేదాకా మేము నమ్మం దొరా
దీంతో కొంతమంది కనీసం ఇప్పటికైనా సినిమా నుండి సాలిడ్ అప్ డేట్ వస్తుంది సంతోషం అంటే మరికొంతమంది మాత్రం ఇలా రిలీజ్ డేట్ చెప్పి చెప్పి మా చెవులకి తూట్లు పొడిచేశారు.వచ్చేదాకా మేము నమ్మం దొరా అంటూ కౌంటర్ వేస్తున్నారు.
Also read :విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!
నిజానికి ఇలా పెద్ద సినిమాలు ఏవి కూడా చెప్పిన డేట్ కి వస్తున్న పరిస్థితి లేదు . .మరో వైపు ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తే అవడం తో మేకర్స్ కన్ఫర్మ్ చేసినప్పుడే అసలు విషయం తెలిసేది అంటూ లైట్ తీసుకుంటున్నారు
సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం
నిజంగా అన్నీ అనుకున్నట్టుగా ఒకవేళ ఆగస్టు 8నే ట్రైలర్ వస్తే మాత్రం సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ లు యూట్యూబ్‌లో రికార్డులని క్రియేట్ చేయడంతో పాటు కాంట్రవర్సీ లకి దారి తీశాయి కూడా .ఇంకొంతమంది అయితే అసలు డైరెక్టర్ గీతా ఒక మహిళ అయి ఉండి ఇలా ఎలా సినిమా తీస్తుందని ఏకి పారేసిన వాళ్ళు కూడా ఉన్నారు.చూడాలి వచ్చే ట్రైలర్ కోసంఇంకెన్ని బాణాలు ఎక్కుపెట్టుకొని రెడీ గా ఉన్నాయో.
రాకింగ్ స్టార్ యష్ డ్యూయల్ రోల్
వీటి సంగతి ఇలా ఉంటె తాజాగా వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో యష్ నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్ .ఇక కేవలం హీరో మాత్రమే కాదండోయ్ .., ఈ సినిమాలో ఫీమేల్ లీడ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతున్నాయట .. రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, అలాగే తారా సుతారియా లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ ని ఆన్ బోర్డు చేసింది గీతా మోహన్ దాస్ .బహుశా ప్యాన్ ఇండియా టార్గెట్ తో ఈ క్యాస్టింగ్ జరిగింది కాబోలు.
ఏమైనా ట్విస్ట్ ఇచ్చి పోస్ట్ పోన్ చేస్తుందా !
ఇదిలా ఉంటె ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ సిరీస్‌తో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా బిజిఎమ్ అందిస్తున్నాడు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే బాలీవుడ్ మెలోడీ కింగ్స్ విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చీలు పాటలు కంపోజ్ చేస్తున్నారు. మాస్ ఎలివేషన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా మ్యూజిక్ ఉండబోతోందని తెలుస్తోంది. చూడాలి మరి అనుకున్నట్లే ఆగస్టు 8న ట్రైలర్ వదిలి ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇస్తుందా, లేక లాస్ట్ మినిట్‌లో ఏమైనా ట్విస్ట్ ఇచ్చి పోస్ట్ పోన్ చేస్తుందా !