E-Paper
Advertisement

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?
Advertisement

Tesla Balance Bike for Kids: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మరో ఆసక్తికరమైన ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి కార్లు, రోబోలు కాకుండా.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెస్లా బ్యాలెన్స్ బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్స్ మార్కెట్ లోకి విడుదలైన కొద్ది సేపట్లోనే స్టాక్ పూర్తిగా అమ్ముడైపోవడం విశేషం.

5 ఏండ్లలోపు పిల్లల కోసం..

ఇప్పటికే పిల్లల కోసం సైబర్‌ క్వాడ్‌ ను తీసుకొచ్చిన టెస్లా, ఇప్పుడు మరో కొత్త ఉత్పత్తితో తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించింది.  ఈ బ్యాలెన్స్ బైక్ ప్రత్యేకంగా 2 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించింది. సాధారణ సైకిల్‌ లా దీనిలో పెడల్స్ ఉండవు. అలాగే ఎలాంటి ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండదు. పిల్లలు తమ కాళ్ల సహాయంతో ముందుకు నడిపిస్తూ బ్యాలెన్స్ నేర్చుకునేలా ఈ బైక్‌ ను రూపొందించారు. దీంతో చిన్నారులు సైకిల్ తొక్కే ముందు ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది.

తేలికైన మెగ్నీషియం ఫ్రేమ్ తో..

Advertisement

టెస్లా ఈ బైక్‌ ను తేలికైన మెగ్నీషియం ఫ్రేమ్తో తయారు చేసింది. దీంతో పిల్లలు ఈజీగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. బైక్ బరువు కూడా తక్కువగా ఉండటంతో మోయడం, ఉపయోగించడం ఈజీగా ఉంటుంది. మరో ముఖ్యమైన ఫీచర్ సీటు. పిల్లల ఎత్తుకు అనుగుణంగా ఐదు స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే సీటు ఇందులో ఉంది. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ సీటు ఎత్తును మార్చుకోవచ్చు. దీంతో ఒకే  బైక్‌ను ఎక్కువ కాలం వరకు ఉపయోగించే అవకాశం ఉంటుంది.

ధర ఎంత అంటే?

ఈ బ్యాలెన్స్ బైక్ ధర 225 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.19 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉంటుంది. ఈ ప్రొడక్ట్ షిప్పింగ్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానుంది.

క్షణాల్లో అమ్మకం

Advertisement

ఈ బైక్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే స్టాక్ మొత్తం అమ్ముడవడం విశేషం. టెస్లా బ్రాండ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి దీనితో స్పష్టమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యాలెన్స్ బైక్‌కు మంచి స్పందన లభిస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం దీన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో చిన్న వయస్సులోనే బ్యాలెన్స్, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఇలాంటి బ్యాలెన్స్ బైక్‌లు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సైకిల్ తొక్కడం నేర్చుకునే ముందు ఈ తరహా బైక్‌పై ప్రాక్టీస్ చేస్తే తర్వాత సాధారణ సైకిల్ నేర్చుకోవడం కూడా చాలా సులభమవుతుంది. టెస్లా మరోసారి కార్లకే పరిమితం కాకుండా పిల్లల కోసం కూడా వినూత్న ఉత్పత్తిని అందించింది. విడుదలైన వెంటనే స్టాక్ అయిపోవడం ఈ ఉత్పత్తిపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

Read Also: EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×