E-Paper
Advertisement

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!
Advertisement

Food Adulteration Law: ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ కల్తీ అవుతుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA) పై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆరోగ్యంపై ప్రభావం..

ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయట పడుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు దిగుమతులకు నిరాకరిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

Advertisement

Also read: కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

కల్తీల నిరోధానికి చట్టాలు

మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, అధిక ధరలు చెల్లించి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలులో ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించాలని సూచించారు.

సీఎం ఆదేశం..

Advertisement

కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థను, టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్తీల నిరోధానికి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అక్కడ నిబంధనలను అమలు చేసి, వాటి అమలులో ఎదురయ్యే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సూచించారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, ఎన్.శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also read: Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×