Trisha Krishnan:త్రిష కృష్ణన్.. పరిచయం అక్కర్లేని ఈ తమిళ పొన్ను తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన చీరకట్టు పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోకి ప్రేమ వెలుగు అని క్యాప్షన్ ని జోడించడం మరో విశేషం. ఫోటో విషయానికి వస్తే బంగారు రంగు అంచుతో చీరకు మ్యాచ్ అయ్యేలా ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడిన బ్లౌజ్ అవుట్ ఫిట్ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది .ముఖ్యంగా ట్రెడిషనల్ జ్యువెలరీ, చిన్న బొట్టు, పూలతో అలంకరించిన జడ త్రిష అందాన్ని డబుల్ చేసిందని చెప్పాలి .
త్రిష సినీ కెరీర్ విషయానికి వస్తే ఆమెకి సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు తమిళ్ సినిమాల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలలో నటించి మెప్పించింది కూడా. ముఖ్యంగా త్రిష పేరు చెప్పగానే మన అందరికీ గుర్తొచ్చే సినిమా వర్షం .ప్రభాస్ తో కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ .
ఆ తర్వాత సిద్ధార్థ కలిసి నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ముఖ్యంగా సినిమాలో త్రిష నటన, పాత్రలో కనిపించే అమ్మాయికత్వం, ఎమోషన్స్ అన్ని ఆడియన్స్ మెస్మరైజ్ చేశాయి. ఇక మహేష్ తో కలిసి నటించిన అతడు సినిమా ఒక ట్రెండ్ సెట్టర్.ఇక ఈ సినిమా ఇప్పటికీ మాటీవీలో వస్తుంటే టాప్ టి ఆర్ పి దక్కుతుండడం విశేషం.
ఇక తెలుగులోనే కాకుండా ఈ భామ కోలీవుడ్ లో నటించిన గిల్లి ,విన్నయ్ తాండి వరువాయి 96 సినిమాలు మంచి సినిమాలుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతితో కలిసి నటించిన 96 సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ క్రియేట్ చేసింది.
అయితే ఈ మధ్య సినిమాలలో కాస్త స్పీడ్ తగ్గించిన త్రిష సోషల్ మీడియాలో సందడి చేయడం విశేషం .ఇక ఈ క్రమంలోనే తాజాగా పెట్టిన ఫోటోలు ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అయితే చాలాసార్లు వెస్ట్రన్, ట్రెండీ దోస్తుల్లో కనిపించే ఈ అమ్మడు అప్పుడప్పుడు చీరకట్టు లో కనిపించడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు త్రిష ఫ్యాన్స్ .మొత్తానికి త్రిష ప్రేమ వెలుగు అనే ఆప్షన్ తో పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా త్రిష MGR బయోపిక్ లో జయలలితగా కనిపించబోతున్నటాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో MGR గా దర్శకనిర్మాత జే ఎం బషీర్ నటించబతున్నాడు అని సమాచారం.తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను నటించే ఎంజీఆర్ బయోపిక్ లో జయలలితగా త్రిషను అనుకుంటున్నారని సెన్సేషన్ కామెంట్స్ వదిలాడు .మరి నిజంగానే త్రిష జయలలితగా మెప్పిస్తుందా చెప్పిన మాటలు నిజమవుతాయా చూడాలి!