E-Paper
Advertisement

Trisha Krishnan: పార్థిబన్ కూతురితో త్రిష.. ఏకంగా ఆమెతోనే పెళ్లి సందడి.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

Trisha Krishnan: పార్థిబన్ కూతురితో త్రిష.. ఏకంగా ఆమెతోనే పెళ్లి సందడి.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!
Advertisement

Trisha Krishnan: ప్రముఖ హీరోయిన్ త్రిష.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. నటుడు విజయ్‌తో ఆమెకు సంబంధం ఉందనే పుకార్లు, అలాగే దర్శకుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న సమయంలో త్రిష చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్థిబన్‌పై తీవ్రంగా స్పందించిన త్రిష, తాజాగా అతని కూతురితో కలిసి ఫొటోలు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.

అతని కూతురుతో త్రిష..!

ఇటీవల స్టైలిస్ట్ ఏకా లఖానీ.. రవి భగచంద్‌కా వివాహ వేడుకలో త్రిష పాల్గొన్నారు. ఆ పెళ్లి వేడుకలో తీసుకున్న కొన్ని ఫొటోలు మరియు వీడియోలను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో దర్శకుడు ఆర్. పార్థిబన్ కూతురు కీర్తనతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

త్రిష తన సోషల్ మీడియా స్టోరీస్‌లో పెళ్లికి సంబంధించిన అనేక క్షణాలను అభిమానులతో పంచుకుంది. వధూవరుల వీడియోను షేర్ చేస్తూ పెళ్లి ఎంతో అందంగా జరిగిందని, వధువు చాలా అందంగా కనిపించిందని ఆమె పేర్కొంది. అలాగే ఉత్తర భారత పెళ్లిళ్లకు ప్రత్యేకమైన వాతావరణం ఉంటుందని చెప్పుతూ మరో వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ఆమెతోనే పెళ్లి సందడి..!

ఈ వేడుకలో త్రిష, కీర్తనతో పాటు మరికొంతమంది అతిథులతో కలిసి సెల్ఫీలు కూడా దిగింది. ఆ ఫొటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే పార్థిబన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించింది. మైక్ చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడకూడదని ఆమె బహిరంగంగా హెచ్చరించింది.

Advertisement

ఇదిలా ఉండగా, అదే వేడుకలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంను కూడా త్రిష కలిసింది. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగింది. ఆ ఫోటోలో నటుడు సిద్ధార్థ్ కూడా కనిపించాడు. అంతేకాకుండా త్రిష తన పర్పుల్ రంగు పట్టు చీరలో తీసుకున్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. బంగారు ఆభరణాలతో సంప్రదాయంగా కనిపించిన ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

విజయ్‌తో త్రిష సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదంగా మారాయి. ఆ వ్యాఖ్యలకు త్రిష కఠినంగా స్పందించడంతో విషయం మరింత చర్చకు వచ్చింది. అయితే ఇప్పుడు పార్థిబన్ కూతురితో కలిసి త్రిష ఫొటోలు దిగడం చాలా మందికి కొత్త ట్విస్ట్‌లా అనిపిస్తోంది.

ALSO READ: 7/G Brundavan Colony 2: అనిత పాత్రలో యంగ్ బ్యూటీ.. అదిరిపోయే అవకాశం అంటున్న ఫ్యాన్స్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×