Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2(Jayammu Nischayammu raa2) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు.
ఈ ప్రోమో వీడియోలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, కమెడియన్ సునీల్ కూడా సందడి చేశారు. ఇలా ఈ నలుగురు వారి సినిమాల గురించి సరదాగా మాట్లాడారు .ఈ నేపథ్యంలోనే జగపతిబాబు త్రివిక్రమ్ తో మాట్లాడుతూ గాడ్ ఆఫ్ వార్(God Of War) అంటూ ప్రశ్నించగా వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా మనసులో ఆరు ముఖాలు కలిగినటువంటి ఒక బొమ్మ రాగానే నా నోటి నుంచి మాటలు వాటంతట అవే వెలువడ్డాయి.. బహుశా ఇది ఆ దైవ సంకల్పమే అంటూ ఈయన మాట్లాడిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా గాడ్ ఆఫ్ వార్ గురించి మాట్లాడుతూ 6 ముఖాలు కలిగిన బొమ్మ అని ప్రస్తావించడంతో ఈ సినిమా భారీగానే ఉండబోతుందని ఎన్టీఆర్ విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యిందని, టైటిల్ మాత్రం ఫైనల్ కాలేదని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ సినిమా టైటిల్ మాత్రం వేరే ఉందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో అతి త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ నెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా తెలియజేయనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: చొక్కా నలగకుండా 500 కోట్లు.. జైలర్ 2 పై అల్లు అర్జున్ పోస్ట్!