Allu Arjun On Jailer 2: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ 2(Jailer 2). జైలర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా 500 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ విధంగా జైలర్ సినిమాకు మంచి సక్సెస్ రావడంతో ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా చూసిన అనంతరం సినిమాపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సైతం జైలర్ 2 సినిమా చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన అనంతరం అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సినిమా గురించి, ఈ సినిమాలో రజనీకాంత్ (Rajinikanth)నటన అలాగే ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ల పట్ల అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ జైలర్ 2 సినిమా పై స్పందిస్తూ రజినీకాంత్ సర్ తాలూకా నిజమైన స్టార్ పవర్ ఏంటో చూపించారు.. ఆయన స్వాగ్ ఆరా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కు కావాల్సిన హై మూమెంట్స్ జైలర్ 2 సినిమా ద్వారా అందించారని అల్లు అర్జున్ తెలిపారు.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ పనిచేసిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ గురించి కూడా అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ బ్రదర్ అనిరుద్ చంపేశావు.. సినిమాలోని నటీనటుల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar)కూల్ హిట్ తో విధ్వంసం చూపించారు అంటూ చిత్ర బృందంపై అల్లు అర్జున్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఇక చివరిగా ఈ పోస్ట్ చేసిన అల్లు అర్జున్ తెలుగులో ఒక కొటేషన్ తో అల్లు అర్జున్ కు వేరే లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు.
#Jailer2 is 🔥🔥🔥
A true showcase of @rajinikanth sir’s star power, swag & aura! A Commercial Entertainer that keeps the adrenaline pumping!
Brother… @anirudhofficial KILLED IT! All the artists, technicians & the producer have poured their hearts into this film. The Showman… pic.twitter.com/DC9qal6KCV
— Allu Arjun (@alluarjun) October 22, 2026
“చొక్కా నలగకుండా 500 +కోట్లు కొల్లగొట్టడం ఒక రజిని గారికే సాధ్యం” అంటూ రజనీకాంత్ జైలర్ 2 చిత్ర బృందానికి అల్లు అర్జున్ అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా సన్ పిక్చర్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అర్జున్ అదే సన్ పిక్చర్ బ్యానర్ లో ప్రస్తుతం రాకా(Raaka) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా దాదాపు 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: బిజినెస్ లో సమంత దూకుడు.. 8 నెలల్లోనే రూ. 120 కోట్ల లాభాలు..పోస్ట్ వైరల్!