E-Paper
Advertisement

దిమ్మతిరిగేలా విజయ్ ఆస్తులు.. భార్య పేరు మీద ఎన్ని కోట్లు ఉన్నాయంటే?

దిమ్మతిరిగేలా విజయ్ ఆస్తులు.. భార్య పేరు మీద ఎన్ని కోట్లు ఉన్నాయంటే?
Advertisement

TVK Chief Vijay Assets సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సిద్ధమయ్యారు. తమిళనాడులోని పెరంబూర్, తిరుచ్చి నియోజకవర్గాల్లో ఆయన ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్ లో రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర చరాస్తులతో సహా అతని ఆర్థిక వివరాలను విజయ్ తెలియజేశారు. వాహనాలలో BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్స్, బైక్ లు కూడా ఉన్నాయి.

ఆదాయపు లెక్కలు

2024–25లో రూ. 184.53 కోట్లు, 2023–24లో రూ. 105.69 కోట్లు, 2022–23లో రూ. 198.71 కోట్లు, 2021–22లో రూ. 237.46 కోట్లు, 2020–21లో రూ. 8.04 కోట్ల ఆదాయాన్ని అఫిడవిట్ లో తెలియజేశారు. అఫిడవిట్ ప్రకారం, విజయ్ భార్య 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,13,520 ఆదాయాన్ని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో, చరాస్తులు, ఆదాయ వివరాలు తెలియజేశారు. తమ పార్టీ టీవీకేకు ఒక అవకాశం ఇవ్వాలని, ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో పార్టీ విజిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం, విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. డీఎంకే ఒక దుష్టశక్తి అంటూ ఆరోపణలు చేశారు పునరుద్ఘాటించారు.

స్థిర, చరాస్తులు

Advertisement

ఎన్నికల అఫిడవిట్ లో విజయ్ తన స్థిర చర ఆస్తులతో పాటు, తన భార్య సంగీత వద్ద ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, ఆభరణాలు, లగ్జరీ వాహనాలున్నట్లు తెలియజేశారు. చరాస్తుల విలువ రూ. 404 కోట్లకు పైగా ఉండగా, స్థిరాస్తుల విలువ రూ. 115 కోట్లు. ఆయన భార్య సంగీత వద్ద రూ. 15 కోట్లకు పైగా విలువైన చరాస్తులు, సుమారు రూ. 2.5 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 537 కోట్లు. విజయ్ తన సంపదలో అధిక భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఖాతాలలో అధిక డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

పెట్టుబడులు, జ్యువెలరీ

తన వద్ద బంగారం, వెండి, వజ్రాలు ఉన్నట్లు విజయ్ అఫిడవిట్‌లో ఉన్నాయి. విజయ్, అతని భార్య వద్ద సుమారు 500 సవర్ల బంగారు ఆభరణాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ వద్ద 800 గ్రాములకు పైగా బంగారం సుమారు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి. సంగీత ఆస్తులలో 3 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, సుమారు రూ. 1 కోటి విలువైన వజ్రాలు కలిగి ఉన్నారు. ఆమె వద్ద సుమారు 2 కేజీల వెండి ఉంది.

Advertisement

Also Read: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమరం.. TVK పార్టీ కీలక నిర్ణయం.. ఏంటంటే?

నగదు, వాహనాలు

విజయ్ తన వద్ద రూ. 2 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. BMW మోడళ్లు, టయోటా లెక్సస్ మరియు టయోటా వెల్‌ఫైర్ వంటి అనేక లగ్జరీ కార్లతో పాటు మారుతి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్ ఎల్ సూపర్ కూడా ఉన్నాయి. విజయ్ రూ. 184 కోట్ల విలువైన ఆస్తులపై ఆదాయపు పన్ను చెల్లించారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×