E-Paper
Advertisement

ఆరు జతల రైళ్లకు అదనపు కోచ్‌లు.. సమ్మర్ స్పెషల్స్ కూడా, రైల్వే గుడ్ న్యూస్!

ఆరు జతల రైళ్లకు అదనపు కోచ్‌లు.. సమ్మర్ స్పెషల్స్ కూడా, రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

Indian Railways Summer Rush Plan: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే రద్దీకి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైళ్లకు అదనపు కోచ్ లను యాడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సదరన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. సమ్మర్ లో రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఎక్కువ మంది ప్రయాణికులకు సీట్లు లభించే అవకాశం ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా నాన్ ఏసీ స్లీపర్, ఏసీ త్రీ టైర్, చైర్ కార్ లాంటి కోచ్‌లను అవసరానికి అనుగుణంగా పెంచనున్నట్లు తెలిపింది.

ఆరు జతల రైళ్లలో అదనపు కోచ్ లు

సదరన్ రైల్వే అధికారిక సమాచారం ప్రకారం, మొత్తం ఆరు జతల రైళ్లలో ఈ అదనపు కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అందులో చెన్నై సెంట్రల్-తిరువనంతపురం ఎక్స్ ప్రెస్ లో రెండు అదనపు ఏసీ త్రీ టైర్ కోచ్‌లను యాడ్ చేయనున్నారు. ఇవి మార్చి 31 నుంచి మే 5 వరకు చెన్నై నుంచి, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 1 నుంచి మే 6 వరకు అందుబాటులో ఉంటాయి.

Advertisement

అటు రామేశ్వరం-మంగళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్ రైల్లో కూడా రెండు అదనపు ఏసీ త్రీ-టైర్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవి రామేశ్వరం నుంచి ఏప్రిల్ 5 నుంచి మే 3 వరకు, మంగళూరు నుంచి ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు అందుబాటులో ఉంటాయి. అటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే చెన్నై సెంట్రల్- తిరుపతి సప్తగిరి ఎక్స్ ప్రెస్ లో ఒక అదనపు చైర్ కార్ కోచ్‌ ను యాడ్ చేయనున్నారు. ఈ కోచ్  మార్చి 30 నుంచి జూన్ 2 వరకు కొనసాగుతుంది. దీని వల్ల తిరుపతి మార్గంలో ప్రయాణించే భక్తులు, ఇతర ప్రయాణికులకు మరింత లాభం కలుగుతుంది.

అటు మరికొన్ని ముఖ్యమైన రైళ్లలో కూడా కీలక మార్పులు చేశారు. చెన్నై సెంట్రల్- ఈరోడ్ యెర్కాడ్ ఎక్స్‌ ప్రెస్,  చెన్నైసెంట్రల్–చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఎంపిక చేసిన తేదీలలో ఒక్కో అదనపు స్లీపర్ కోచ్‌ ను యాడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోచ్ రాత్రి ప్రయాణాలు చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

సమ్మర్ కోసం స్పెషల్ రైలు  

Advertisement

అటు వేసవి సీజన్ కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ రైలును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగాచి వరకు నడిచే ఈ రైలు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో రెండు వైపులా  మొత్తం 10 ట్రిప్పులు నడుస్తుంది. ఇందులో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్‌ తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

Read Also: క్షణాల్లో తత్కాల్ టిక్కెట్ బుకింగ్, కటకటాల్లోకి సూపర్ యాప్ క్రియేటర్!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×