E-Paper
Advertisement

Carmeni Selvam: నా పేరు కాదు.. నా సంగీతం గురించి అంతా మాట్లాడుకోవాలి- మ్యూజిక్ డైరెక్టర్

Carmeni Selvam: నా పేరు కాదు.. నా సంగీతం గురించి అంతా మాట్లాడుకోవాలి- మ్యూజిక్ డైరెక్టర్
Advertisement

Carmeni Selvam: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కార్మేని సెల్వం’ (Carmeni Selvam). విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే (Ramanujan MK) తమ సంస్థ ద్వారా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అరెరె’ పాట ఎమోషనల్‌గా ప్రేక్షకుల మనసులను హత్తుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను సంగీత దర్శకుడు రామానుజన్ ఎంకే. తెలియజేశారు.

Also Read- బాలీవుడ్ కు దూరంగా నాగచైతన్య..లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ కారణమా?

సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఒక వ్యక్తికి కాకుండా, ఒక సంస్థకు దక్కాలనేది మా ఆలోచన. అందుకే 2017లో బెంగళూరులో ‘Musicloud Studio and Technology’ని ప్రారంభించాం. మేము సౌండ్ డిజైన్, వాయిస్‌ ఓవర్లు, డబ్బింగ్ వంటి అన్ని సేవలను అందించాము. ప్రస్తుతం ‘కార్మేని సెల్వం’ ప్రాజెక్టును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీత దర్శకుడి పేరు కాకుండా.. మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా బడ్జెట్, వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంటుంది. సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకునే.. ఇలా ప్లాన్ చేశాం. ఇటువంటి సేవను వినియోగించుకోవడం ద్వారా, చిత్ర నిర్మాతలకు మ్యూజిక్ క్లౌడ్ స్టూడియోకు మధ్య ఒక రెవెన్యూ మోడల్ రూపొందించబడింది. ఈ ఆదాయ నమూనా కింద, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేము సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాము. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు.

Also Read- అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్… బిగ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్న అట్లీ.. ఫాన్స్ కు పూనకాలే..

నా లక్ష్యమిదే..

Advertisement

నేను గతంలో దర్శకుడు రామ్‌తో కలిసి అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కురైయొండ్రుమ్ ఇల్లై’ చిత్రానికి పనిచేశా. ఇప్పుడు ‘కార్మేని సెల్వం’ వంటి గొప్ప ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి సంగీతం అందించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ రామ్ చక్రితో పరిచయం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పగలను. ‘కార్మేని సెల్వం’ సినిమా కోసం 4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, OST ట్రాక్స్ కంపోజ్ చేశాను. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. సంగీతం ఎప్పుడూ ఒక వ్యక్తి పని కాదు.. అది టీమ్ వర్క్. ‘అరెరె’ పాటకు తెలుగులో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తండ్రి-కొడుకుల మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఇందులో వైలిన్, ఫ్లూట్ బదులు సారంగి ఉపయోగించాము. అది ఎమోషన్స్‌ని మరింత బలంగా చూపించింది. ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు చాలా సపోర్టివ్, సింపుల్ వ్యక్తి. ఆయన అందరి పనిని గమనిస్తూ ప్రోత్సహిస్తారు. కనీసం 10 మంచి, అర్థవంతమైన సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కోరిక. నేను ఎవరితోనూ పోల్చుకోను. మంచి కథలు, మంచి సినిమాల్లో భాగం కావడమే నా లక్ష్యం. నా పేరు కంటే నా సంగీతమే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచివాలని కోరుకుంటూ సంగీతం అందిస్తున్నాము’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- మానసికంగా కృంగిపోయాను.. ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను: హేమ

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×