BigTV English

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Comedian : చీపురుతో కొట్టిన భార్య… అవమానంతో సూసైడ్ చేసుకున్న స్టార్ కమెడియన్

Kannada Actor : ఆవేశం మనిషిని హరిస్తుంది అని ఎన్నో సందర్భాల్లో మనం నేనే ఉంటాము.. అయిందానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి కొందరు ఆవేశంతోను, లేదా కొన్ని భరించలేని బాధల వల్ల ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.. ఈ మధ్య ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొద్దిరోజుల క్రితం ఓ నటుడు భార్య పెట్టే బాధలు భరించలేక చనిపోయారు అంటూ వార్తలు వినిపించాయి.


ఇప్పుడు అదే తరహాలో మరో ప్రముఖ కన్నడ నటుడు సిద్ది భార్య చీపురుతో కొట్టిందని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కన్నడ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారింది. ఆయన భార్య చీపురుతోను, కర్రతోను కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. ఈయన మరణంతో కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఈయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

నటుడు ఆత్మహత్య.. 


కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు, సీరియల్స్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ సిద్ది.. ఈయన 2011 నుంచి ఇండస్ట్రీలో నటుడుగా రాణిస్తున్నారు. ఎన్నో సీరియల్స్ సినిమాల ద్వారా ఫేమస్ అయిన ఈయన.. భార్య కొట్టిందని ఆత్మహత్య చేసుకోవడం పలువురిని కలవరపెడుతుంది. ఆయనను తన భార్య చీపురుతోను, కర్రతో కొట్టిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. నటుడు మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేవలం తన భార్య కొట్టిందని ఆవేదనతో చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న ఈయన ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ప్రాణాలు వదలడం బాధాకరం.. ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే సిద్ధి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్లు పెడుతున్నారు.

70కి పైగా చిత్రాల్లో నటించిన సిద్ది.. 

 కన్నడ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సిద్ధి నటుడుగా మాత్రమే కాదు.. అటు సంగీత దర్శకుడుగా కూడా పని చేశారని తెలుస్తుంది. 2020లో ఖిలాడిగలు అనే షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత సీరియల్స్లలో నటించి నటుడిగా ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. మొత్తం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు 70 సినిమాలకు పైగా నటించి కమీడియన్ గా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. అనతికాలంలోనే వరుసగా సినిమాలు చేసి కమెడియన్ గా అందరి మనసులను దోచుకున్నాడు. కెరియర్ పిక్స్ లో ఉండంగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు తన భార్య వల్లే తను ప్రాణాలను వదిలేసిన విషయం తలుచుకొని అభిమానులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ఆయన భార్య స్పందించి గొడవకు గల కారణాలను వివరిస్తుందేమో చూడాలి… ఆయన అంత్యక్రియల్లో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం..

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×