DMart Ready Grocery Delivery: డి-మార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే అందించడంతో నిత్యం వేలాది మంది కస్టమర్లు దగ్గరలోని స్టోర్లకు వెళ్తుంటారు. రోజువారీ నిత్యవసర సరకుల నుంచి గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించడంతో చాలా మంది డి-మార్ట్ లో షాపింగ్ చేసేందుకు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే డి-మార్ మరో క్రేజీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా డి-మార్ట్ సరుకులను హోం డెలివరీ చేయనుంది. టైమ్ వేస్ట్ చేసుకుని షాపింగ్ చేయాల్సిన పని లేకుండా చేస్తోంది. అదీ తక్కువ ధరల్లోనే. ఇంతకీ ఈ సర్వీసును ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
‘డి-మార్ట్ రెడీ’ యాప్ తో నేరుగా సరుకులు హోం డెలివరీ
డి-మార్ట్ ఆన్ లైన్ సర్వీసులను కూడా ప్రారంభించింది. ‘డి-మార్ట్ రెడీ’ అనే యాప్ తో నేరుగా సరుకులను ఇంటికే డెలివరీ చేస్తోంది. అంతేకాదు, ఫస్ట్ మూడు ఆర్డర్లకు డెలివరీలు ఉచితంగానే అందిస్తున్నారు. అంటే ఎలాంటి ఆర్డర్ చేసినా అదనపు ఛార్జీలు లేకుండా ఇంటికే సరుకులు తెచ్చి ఇస్తారు. రోజువారీ అవసరమైన గ్రాసరీలు, స్టేపుల్స్, గృహోపయోగ వస్తువులు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. డి-మార్ట్ నుంచి హోం డెలివరీ అందించే వస్తువులు ఇవే..
⦿ నిత్యవసరాలు: బియ్యం, పప్పులు, నూనెలు, మసాలాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, తాజా పండ్లు, కూరగాయలు.
⦿ గృహోపయోగ వస్తువులు: క్లీనింగ్ ఉత్పత్తులు, కిచెన్ వేర్, డిటర్జెంట్లు, గృహ ఉపకరణాలు.
⦿ వ్యక్తిగత సంరక్షణ: స్కిన్ కేర్, హెయిర్ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులు.
ప్రత్యేక తగ్గింపు ధరలు
డి-మార్ట్ రెడీ యాప్ ద్వారా డిమార్ట్ స్టోర్ లో అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్లను, ప్రత్యేక తగ్గింపులను పొందే అవకాశం ఉంటుంది. డీల్స్ ఆఫ్ ది డేలో లేయర్ వోట్‌గర్ల్ స్ప్రే రూ.225 బదులు రూ.112కే, వాఘ్ బక్రి ప్రీమియం టీ కేజీ రూ.620 బదులు రూ.527కే, తాజ్ మహల్ టీ 500 గ్రా రూ.380 బదులు రూ.320కే లభిస్తోంది. అలాగే డవ్ క్రీమ్ బ్యూటీ సోప్ 4 ప్యాక్ రూ.522 బదులు రూ.367కే లభిస్తోంది. హార్పిక్ 1 లీటర్ రూ.205 బదులు రూ.175కే, సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ (ఫ్రంట్ లోడ్, 4 లీటర్) రూ.799 బదులు రూ.524కే లభిస్తోంది. అంటే రూ.275 తగ్గింపు అందిస్తోంది. ఇంకా ఎన్నో డీల్స్ డి-మార్ట్ రెడీ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. కావలసింది కేవలం మొబైల్ ఓపెన్ చేసి, ఆర్డర్ చేయడమే.
డీ-మార్ట్ రెడీ సేవలు వారికి మాత్రమే!
ప్రస్తుతం డి-మార్ట్ హోం డెలివరీ సేవలు ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, అమృత్ సర్, చెన్నై, సూరత్ లాంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులకు సులభంగా రిటర్న్, రీఫండ్ ఆప్షన్ ఉంది. క్యాష్/కార్డ్ ఆన్ డెలివరీ, క్రెడిట్/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉంది.
Read Also: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!