Coolie Movie : తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ (Coolie). ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. కూలీ కోసం తెలుగు ప్రేక్షకులు మరింత ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం అక్కినేని నాగార్జున. ఈ మూవీలో నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
250 వసూల్ చేసిన కూలీ..
కూలీ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.. లోకేష్ కనకరాజు ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందని అటు రజిని అభిమానులు.. ఇటు అక్కినేని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ లాంటి స్టార్లతో ఈ సినిమా అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చుకుంది.. అలాగే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ లోను `కూలీ` సంచలనాలు సృష్టిస్తోంది.. రిలీజ్ కు ముందే భారీ అంచనాలను సృష్టించడంతో ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. భార్య చీపురుతో కొట్టిందని నటుడు ఆత్మహత్య..
రిలీజ్ కు ముందే ‘కూలీ’ హిట్..
రజినీకాంత్ సినిమాలంటే బిజినెస్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కష్టమే.. ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే బిజినెస్ మాత్రం ఊహించని రేంజ్ లో అవుతుంది. అదేవిధంగా ఈ కూలీ సినిమాకు కూడా భారీగానే బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తమిళనాడు సహా అంతర్జాతీయ మార్కెట్లోను హవా సాగిస్తోంది. సాంకేతికంగా అత్యుత్తమంగా తెరకెక్కిన కూలీ డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ హక్కుల అమ్మకం ద్వారా ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంటర్నేషనల్ రైట్స్ రూపంలో రూ. 68 కోట్ల డీల్ కుదిరింది.. సౌత్ లో మాత్రమే కాదు అటు నార్త్ లో కూడా లోకేష్ కనకరాజు సినిమాలకు డిమాండ్ ఉంది. అదేవిధంగా ఈ సినిమాకి కూడా మంచి క్రేజ్ లభించింది. ఇప్పటివరకు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజర్సు, ట్రైలర్లు, అటు పోస్టర్లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో మరో రెండు రోజులు తెలియనుంది.. ఈ మూవీ భారీ విజయాన్ని అనుకుంటుందని తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు.