E-Paper
Advertisement

డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల జీతం, సెలక్షన్ ప్రాసెస్ ఇదే

డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.60వేల జీతం, సెలక్షన్ ప్రాసెస్ ఇదే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (E-1 గ్రేడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన యువతకు ఇది గొప్ప అవకాశంగా నిలుస్తోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ జియాలజీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ రాజభాష (హిందీ) కంపెనీ సెక్రటరీ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: అర్హత విషయానికి వస్తే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ. దివ్యాంగులకు మార్కుల విషయంలో వెసులుబాటు కల్పించారు. వారు 55 శాతం మార్కులు సాధించి ఉంటే దరఖాస్తుకు అర్హులు అవుతారు. ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.

వయోపరిమితి: 2026 ఏప్రిల్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ. ఓబీసీ దివ్యాంగులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 ప్రారంభ వేతనం లభిస్తుంది. మహారత్న కంపెనీలో ఉద్యోగం పొందడం ద్వారా మెరుగైన కెరీర్ గ్రోత్ పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

దరఖాస్తు ప్రక్రియ: పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 మే 12 నుంచి కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

చివరి తేది: దరఖాస్తు సమర్పించడానికి 2026 జూన్ 11 ఆఖరి తేదీగా నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1,180 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో పాటు కోల్ ఇండియాలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

సెలక్షన్ ప్రాసెస్: ఎంపిక విధానం అత్యంత పారదర్శకంగా జరగనుంది. కేవలం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (CBT)లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎట్లాంటి ఇంటర్వ్యూలు లేకుండా కేవలం పరీక్ష ద్వారానే ఈ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయడం విశేషం.

ఈ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ పరీక్షా సరళి వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్ స్థాయిలో స్థిరపడటానికి ఇది ఒక సువర్ణావకాశం.

వెబ్ సైట్: https://www.coalindia.in/

ALSO READ: టెన్త్ అర్హతతో 1644 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, ఇంకెందుకు ఆలస్యం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×