E-Paper
Advertisement

BSNL రూ.1 ప్లాన్.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్.. దీనిని కొట్టేదే లేదు భయ్యా!

BSNL రూ.1 ప్లాన్.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్.. దీనిని కొట్టేదే లేదు భయ్యా!
Advertisement

Rs. 1 Freedom Plan: దేశంలో అత్యంత చౌకగా రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్ (BSNL)కు పేరుంది. ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ చాలా చౌకగా ఉంటాయి. సామాన్యులకు అతిదగ్గరగా ఉంటూ.. బోలెడన్నీ ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ మరో కనివిని ఎరుగని రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఫ్రీడమ్ ప్లాన్ పేరుతో రూ.1కే అద్భుతమైన ప్రయోజనాలను ప్రకటించింది. ప్రస్తుతం ఈ అత్యంత చౌకైన ప్లాన్.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

రూ. 1 ప్లాన్ బెనిఫిట్స్

ఈ ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ప్రతిరోజూ 2GB హై స్పీడ్ డేటా యూజర్ కు లభించనుంది. అంటే ప్లాన్ పూర్తయ్యే సమయానికి మెుత్తం 60GBని యూజర్ వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం యూజర్ కు లభిస్తాయి.

ఈ ప్లాన్ వారికి మాత్రమే..!

Advertisement

అయితే ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు అందరికీ అందుబాటులో ఉండదు. ఈ ఫ్రీడమ్ ఆఫర్ ప్రధానంగా కొత్తగా బీఎస్‌ఎన్ఎల్ సిమ్ తీసుకునే వారికి మాత్రమే వర్తించనుంది. అలాగే ఇతర నెట్‌వర్క్ నుండి బీఎస్‌ఎన్ఎల్‌కు మారే వారికి మాత్రమే ఈ ప్లాన్ కు యాక్సెస్ లభించనుంది.

Also Read: BSNLలో అత్యంత చౌకైన.. టాప్ – 7 రీఛార్జ్ ప్లాన్స్.. ధర తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ!

రూ.1 ప్లాన్ పొందాలంటే?

Advertisement

సాధారణ బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ తరహాలో రూ.1 ప్లాన్ ఆన్ లైన్ లో అందుబాటులో లేదు. ఈ ప్లాన్ పొందాలంటే బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించాల్సిందే. లేదంటే సంబంధిత రిటైలర్ వద్దకు వెళ్లి కొత్త సిమ్ తీసుకోవడం ద్వారా రూ. 1 ప్లాన్ పొందొచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, బీఎస్ఎన్ఎల్ తన 4G నెట్‌వర్క్ సామర్థ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ రూ. 1 ఫ్రీడమ్ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Gen Zని ఫిదా చేస్తున్న.. టాప్ – 5 వైర్డ్ ఇయర్ ఫోన్స్.. మ్యూజిక్ లవర్స్‌కు పండుగే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×