E-Paper
Advertisement

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

అణిచివేయాలని చూస్తే సహించేది లేదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!
Advertisement

Upasana Konidela: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక ఉపాసన నిరంతరం మహిళా సాధికారత కోసం శ్రమిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఎంతోమంది మహిళలకు ఉపాసన(Upasana) స్ఫూర్తిగా నిలిచారు. ఇకపోతే తాజాగా ఉపాసన ఫెస్టివల్ ఫర్ జాయిస్ (Festival For Joys)కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఫెస్టివల్ ఫర్ జాయిస్ సంస్థ ద్వారా ఎంతో మంది వృద్ధులు అనాధలకు పండుగలు జరుపుకునే వారికి సపోర్ట్ చేస్తూ పండుగ సంతోషాన్ని కల్పిస్తున్నారు.

ఫెస్టివల్ ఫర్ జాయిస్..

ఇక ఈ సంస్థ ద్వారా యాంకర్ సుమ (Suma)పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సంస్థ ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాసన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసన యాంకర్ సుమపై ప్రశంసల కురిపించారు .సుమ ఒకవైపు తన వృత్తిపరమైన జీవితాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని ప్రశంసించారు.మరో వైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారని ఈమె చాలామందికి ఇన్స్పిరేషన్ అంటూ సుమ గురించి ఉపాసన గొప్పగా మాట్లాడారు.

ఎదుగుదల కోసం ఇతర మహిళలను తొక్కేస్తున్నారు..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన మహిళల గురించి మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఈమె ముక్కు సూటిగా మాట్లాడుతూనే మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో మహిళలు తమ ఎదుగుదల కోసం ఇతర మహిళలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఉపాసన తెలిపారు. ఇలా చేసేవారు పూర్తిగా వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఉపాసన కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒక ఆడదాన్ని తొక్కేసి ఎదగాలని కోరుకునే వారికి అది ఎప్పటికీ విజయం కాదని తెలిపారు..

వీక్ మగాడిని సంతోష పెట్టడం కోసం …

వారికి సంతోషాల కోసం లేదంటే ఒక వీక్ మగాడిని సంతోష పెట్టడం కోసం మరొక ఆడదాన్ని ఇబ్బంది పెట్టే వారికి తాను వార్నింగ్ ఇస్తున్నానని ఇలాంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఉపాసన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమాజంలో ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసే గొప్ప మనసు ఆడవారికి ఉండాలి అంటూ ఉపాసన తెలియజేశారు. ఇలా ఉపాసన మహిళను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా, మహిళలలో ఈమె చేసిన వ్యాఖ్యలు కొత్త ఆలోచనకు దారితీస్తాయని చెప్పాలి. ఇక ఉపాసన ఇప్పటికే అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు మహిళా సాధికారత కోసం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: రేయ్ త్రిగుణ్ లేగురా…మరీ ఇంత లేకిగానా.. ఇచ్చి పడేసిన నాగార్జున!

Related News

రాజశేఖర్‌తో బాబూమోహన్ స్నేహం వెనుక ఇంత కథ ఉందా?

మోహన్ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువే చదివా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!

అవంతిక మిశ్రా అందాల జాతర.. ఆ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న మెగా డాటర్ నిహారిక!

40 ఏళ్ల సినీ కెరియర్ లో ఫస్ట్ టైం ఆ పని చేసిన రజినీకాంత్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

తెలంగాణ పెళ్లిళ్లంటే మందు సీసాలేనా? ‘గడప’ పాటపై రచ్చ!

Big Stories

Advertisement
×