E-Paper
Advertisement

ప్రేమ పేరుతో 20 మంది లేడీ కానిస్టేబుళ్లను పడేసిన కేటుగాడు.. కానీ చివరికి..?

ప్రేమ పేరుతో 20 మంది లేడీ కానిస్టేబుళ్లను పడేసిన కేటుగాడు.. కానీ చివరికి..?
Advertisement

Vikrant Tomar; వీడు మాములోడు కాదు. ఏకంగా 20మంది అమ్మాయిలను లవ్‌లో పడేశాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటో తెలిస్తే.. ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే వాళ్లందరూ పోలీసు కానిస్టేబుల్సే మరో మైండ్‌ బ్లాకింగ్‌ సీక్రెట్‌ ఎంటో తెలుసా ఆ కానిస్టేబుల్స్ అందరు ఒకే బ్యాచ్‌కి చెందిన వాళ్లే. ఇలాంటి కేటుగాళ్లు నెవ్వర్‌ బిఫోర్ ఎవ్వర్‌ ఆఫ్టార్ లాఠీలు పట్టుకొని తిరిగే చేతులకే వీడు లవ్ లెటర్ ఇచ్చాడంటే వీడికి ఎన్ని గుండెలు ఉండాలి.

పెద్ద రిచ్‌కిడ్‌లా బిల్డప్..

వీడు పేరు విక్రాంత్ తోమర్.. ఊరు ఉత్తరప్రదేశ్‌ చూడటానికి బాలీవుడ్‌ యాక్టర్‌లా ఉన్నాడు కదా కానీ వీడు చేసేవన్నీ బద్మాష్‌ పనులే సోషల్ మీడియాలో వీడిది ఫుల్ లగ్జరీ లైఫ్ పెద్ద రిచ్‌కిడ్‌లా బిల్డప్ ఇస్తాడు. ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో తిరుగుతూ సెల్ఫీలు అప్‌లోడ్ చేస్తాడు. వాటిని చూసి అమ్మాయిలు తోమర్‌ గాడు ప్రపోజ్‌ చేయగానే నో చెప్పకపోయేవాళ్లు ఆ తర్వాత వాళ్ల దగ్గరి నుంచి లక్షలు లాగేయడం వీడి అసలుసిసలు బిజినెస్.

12 లక్షల రూపాయలు..

Advertisement

ఢిల్లీ కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్‌ కంప్లైంట్‌తో వీడి బాగోతమంతా బయటపడింది. ఆమెను మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చాడట మనోడు. బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు డబుల్ అవుతాయని నమ్మించాడు. పాపం ఆ లేడీ కానిస్టేబుల్ సేవింగ్ చేసుకున్న మనీ అంతా తీసుకువచ్చింది. సరిపోవడం లేదంటే 12 లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకొని మొత్తం 24 లక్షల రూపాయాలను ఆ కేటుగాడి చేతిలో పెట్టింది.

ఇలా వాడి దందా..

ఆ దొంగ గాడి ప్లాన్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే తాను రిచ్‌కిడ్‌ అని నమ్మించడానికి లగ్జరీ కార్లను రెంట్‌కి తెచ్చుకునేవాడు. ఆ కార్లలో ఆ లేడీస్‌ని తిప్పుతూ తానొక బిగ్ బిజినెస్‌మ్యాన్‌ అంటూ బిల్డప్‌ ఇచ్చేవాడు. ఒక అమ్మాయి దగ్గర తీసుకున్న డబ్బులతో మరో అమ్మాయిని ట్రాప్‌లో పడేసేందుకు ఖర్చు చేసేవాడు. ఇలా వాడి దందా బీస్ నెంబర్ వరకు వచ్చి ఆగింది. వాడి గురించి ఆరా తీసి పోలీసులే ఖంగుతిన్నారు. తోమర్‌గాడితో ఓ అమ్మాయి సహజీవనం చేస్తోంది. ఆమె కూడా కానిస్టేబులే. ఆమెనే లేడీ కానిస్టేబుళ్ల డీటెయిల్స్ ఇచ్చింది. అందుకే బ్యాచ్‌ బ్యాచనంతా లైన్‌లో పెట్టేశాడు.

అధికారులకే షాక్..

Advertisement

తీగ లాగితే డొంక కదిలినట్లు అసలు నిజాలు బయటికి వచ్చాయి. విక్రాంత్ జాతకం చూసి అధికారులకే దిమ్మతిరిగిపోయింది. వీడి మీద ఆల్రెడీ ఇలాంటి చీటింగ్ కేసులు బోలెడన్నీ ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లోనే బెయిల్‌పై బయటికి వచ్చాడట. వీడికి బెయిల్ అయితే వచ్చింది కానీ.. బుద్ది మాత్రం రాలేదు. ఈ తోమర్‌గాడిని స్టేషన్‌లో కూర్చొబెట్టి తోమితే.. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లాడు.

Also read: AI వల్ల జాబ్స్ పోవడం కాదు.. రూ. 1 కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ కొత్త జాబ్స్ గురించి తెలుసా?

Tags

Related News

యూపీలో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి.. ఒంటిపై నుంచి కారు ఎక్కించి..

జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, గార్డుల మధ్య ఘర్షణ.. తరగతులు ఆన్‌లైన్‌కు మళ్లింపు!

ర్యాపిడో డ్రైవర్ ముసుగులో జైషే ఉగ్రవాది.. కస్టమర్లను ఎక్కించుకుంటూ.. పాక్‌తో కలిసి ఉగ్ర కుట్రలు!

‘అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు’.. చైనా వ్యూహంపై కేంద్ర మంత్రి సెటైర్లు!

చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!

కర్ణాటక ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. సీఎం డీకే శివకుమార్ సంచలన విషయాలు వెల్లడి!

ప్రపంచ శాంతికి వేదిక యూఎన్.. అయినా యుద్ధాలు ఎందుకు ఆగడం లేదు?

Big Stories

Advertisement
×