E-Paper
Advertisement

రేయ్ త్రిగుణ్ లేగురా…మరీ ఇంత లేకిగానా.. ఇచ్చి పడేసిన నాగార్జున!

రేయ్ త్రిగుణ్ లేగురా…మరీ ఇంత లేకిగానా.. ఇచ్చి  పడేసిన నాగార్జున!
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది .ఈ కార్యక్రమం 48వ రోజును పూర్తి చేసుకోబోతుంది. తాజాగా 48వ రోజుకు సంబంధించిన మూడవ ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగార్జున(Nagarjuna) హౌస్ మేట్స్ తో మాట్లాడటమే కాకుండా వారంలో కంటెస్టెంట్ లో తీరు గురించి కూడా ప్రస్తావిస్తూ వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో వీడియోలో భాగంగా త్రిగుణ్ పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోట్ శివకు ఇచ్చేసిన త్రిగుణ్..

ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగార్జున వేదిక పైకి రాగానే రే త్రిగున్(Trigun) లెగరా.. ఏరా నువ్వు గోటా బిగ్ బాస్ ఎదో నిన్ను గోట్ ఆఫ్ స్పీడ్ అని పిలిచారు కానీ ఇలాగేనా బిహేవ్ చేసేది అంటూ త్రిగుణ్ పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరా త్రిగుణ్ అంటూ ఈ గోట్ టాస్క్ లో భాగంగా రోహిత్ త్రిగుణ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేస్తూ నాగార్జున మండిపడ్డారు. మరి ఇంత లేకిగా, చీప్ గా బిహేవ్ చేస్తావా? త్రిగున్ నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఏంటో నువ్వే చెప్పు అంటూ నాగార్జున అడగడంతో వెంటనే త్రిగుణ్ మాట్లాడుతూ నా గోట్ ను శివకు తిరిగి ఇచ్చేస్తున్నానని తెలియజేశారు.

నాగ్ చేత చివాట్లు తిన్న త్రిగుణ్..

Advertisement

దశావతారంలో తాను ఒకటి ఇంట్రడ్యూస్ చేయకూడదని గట్టిగా అనుకున్నాను కానీ నువ్వు బలవంతంగా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేస్తున్నావు అంటూ నాగార్జున త్రిగుణ్ వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈరోజు జరిగే ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున ఏ కంటెస్టెంట్ తీరుపై ఎలా మండిపడతారనేది తెలియాల్సి ఉంది. ఇక మొదటి నుంచి కూడా త్రిగుణ్ తన వ్యవహరి శైలిలో భాగంగా నాగార్జున చేత చివాట్లు తింటూనే ఉన్నారు. మరి ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున ఈయనకు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక గోట్ టాస్క్ విషయానికి వస్తే “గోట్ ఆఫ్ స్పీడ్” (GOAT of Speed) టాస్క్‌లో త్రిగుణ్ విజేతగా నిలిచాడు.శివ్ తన త్యాగంతో త్రిగుణ్‌కు ఇమ్యూనిటీ లభించడానికి, రెండు వారాల పాటు హౌస్‌లో సేఫ్‌గా ఉండటానికి సహాయపడ్డాడు. కానీ ఈ ప్రోమో వీడియోలో భాగంగా త్రిగుణ్ తిరిగి గోట్ శివకు ఇచ్చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక త్రిగుణ్ ఈవారం నామినేషన్ లో నిలిచిన ఓటింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈవారం నామినేషన్ లో 12 మంది కంటెస్టెంట్లు ఉండగా డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందని తెలుస్తోంది. అయితే డేంజర్ జోన్ లో ఉన్నటువంటి దక్షి (Dakshi)ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

Also Read: మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న మెగా డాటర్ నిహారిక!

Related News

ఇంత అహంకారమా?  నాగార్జున ఫైర్.. హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలిని?

ఇదెక్కడి పోలిక రా నాయనా.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ మహాభారతంలో ఏ పాత్రకు సరిపోతారంటే?

ట్రెయిటర్స్‌లో ఆట పక్కన పెట్టి పర్సనల్ అటాక్‌లు.. ఇదేం గొడవరా బాబూ!

సుమ 116 ఏళ్ళు బ్రతకాలి..రాజీవ్ మాటలకు సుమ ఎమోషనల్!

బిగ్ బాస్ 10 హోస్ట్ గా రమ్య కృష్ణ…ఆ హీరో తప్పుకున్నట్టేనా?

‘గాజుల గల గల’ సింగర్‌కు ఏమైంది? సోషల్ మీడియాలో ఎందుకీ ట్రోలింగ్?

బిగ్ బాస్ 10లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. మరొకరు కూడా?

Big Stories

Advertisement
×