E-Paper
Advertisement

Upasana Konidela: బేబీ బంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన…ఆ రూమర్లకు చెక్ !

Upasana Konidela: బేబీ బంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన…ఆ రూమర్లకు చెక్ !
Advertisement

Upasana Konidela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇక మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసనకు(Upasana) సైతం అదే స్థాయిలో ఆదరణ ఉంది. ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన వృత్తిపరమైన విషయాల ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఉపాసన వృత్తి పరమైన జీవితాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 10 సంవత్సరాలకు ఈ దంపతులకు మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఈ చిన్నారికి క్లిన్ కారా(Klin Kaara) అని నామకరణం చేశారు. ఇలా ఈ చిన్నారి జన్మించిన రెండు సంవత్సరాలకి ఉపాసన మరొక గుడ్ న్యూస్ తెలియజేశారు.

మెగా వారసులు రాబోతున్నారా? 

ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఉపాసన ఏకంగా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక నవంబర్ నెలలో ఉపాసనకు ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో సీమంతపు వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా మెగా వారసుడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఉపాసన కచ్చితంగా కవల మగ పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ అభిమానులు కూడా ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాసన బేబీ బంప్

Advertisement

ఇక ఉపాసన తన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత పెద్దగా బయట ఎక్కడ కనిపించిన సందర్భాలు కూడా లేవు దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీ పై ఎన్నో రకాల రూమర్లు కూడా బయటకు వచ్చాయి . ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఎంతోమంది ఈమె ప్రెగ్నెన్సీ పై కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఉపాసన బేబీ బంప్ తో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఉపాసన బేబీ బంప్ తో కనిపించడంతో ఈమె ప్రెగ్నెన్సీ గురించి వచ్చిన రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయ్యింది.

Advertisement

తాజాగా రామ్ చరణ్ ఇంటికి ప్రముఖ ఫేమస్ బిర్యానీ చెఫ్ ఒసావా వచ్చారు. చరణ్ కుటుంబ సభ్యులకు కోసం ఈయన ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఉపవాసన బేబీ బంప్ ఫోటో కూడా  వైరల్ అవుతుంది. ఇలా సీమంతం తర్వాత ఉపాసన మొదటిసారి బేబీ బంప్ తో కనిపించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన మరి కొన్ని రోజులలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది . ఇక రాంచరణ్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .అయితే మార్చి 27వ తేదీ విడుదల కావలసినవి సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై చిత్ర బృందం అధికారిగా ఎక్కడ స్పందించలేదు.

Also Read: Anupama Parameswaran: టాలీవుడ్ యంగ్ హీరోతో అనుపమ ‘కళ్యాణం’… పోస్టర్ వైరల్!

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×