E-Paper
Advertisement

Winter Cars: వింటర్ లో ఈ కార్లలో వెళ్తే భలే కిక్ ఉంటుంది బ్రో, మీరూ ట్రై చేయండి!

Winter Cars: వింటర్ లో ఈ కార్లలో వెళ్తే భలే కిక్ ఉంటుంది బ్రో, మీరూ ట్రై చేయండి!
Advertisement

ఒక్కో కారు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. డ్రైవింగ్ ను ఆస్వాదించే వాళ్లు ఆయా సీజన్ కు అనుగుణంగా ఉండే కార్లను ఎంచుకుంటారు. వింటర్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే 1990 నుంచి 2000ల నడుమ విడుదలైన ఈ కార్లను సెలెక్ట్ చేసుకోండి. శీతాకాలపు డ్రైవింగ్ ను మరింత ఉత్సాహభరితంగా మార్చుతాయి.

⦿ సుబారు ఇంప్రెజా

సుబారు ఇంప్రెజా వింటర్ లో డ్రైవింగ్ కు క్రేజీగా ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ అవసరం లేదు. ఫ్లాట్ ఫోర్ ఇంజిన్, ఫోర్ వీల్ డ్రైవ్ , సురక్షితమైన, ఆకర్షణీయమైన హ్యాండ్లింగ్‌తో ఉంటుంది. మార్పు కోసం, కారు హెడ్‌ లైట్లను బట్టి మూడు పేర్లతో ఈ కారును పిలుస్తారు. 2000 నుంచి 2002 కార్లను వాటి గుండ్రని హెడ్‌ల్యాంప్‌ల ను కలిగి ఉండేది. దీనిని ‘బుగేయ్’ అని పిలిచేవారు. 2002 నుంచి 2005 కార్లను ట్రెడిషనల్ లైటింగ్ తో వచ్చిన కారును ‘బ్లోబీ’ అని పిలిచే వాళ్లు. 2005 నుండి 2007 వచ్చిన కార్లను ‘హాకీ’ అని పిలిచేవారు. ఈ కారు ఎంట్రీ లెవల్ 1.6 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. రైడ్, హ్యాండ్లింగ్, ట్రాక్షన్ అద్భుతంగా ఉన్నాయి. శీతాకాల రైడింగ్ కు బాగుటుంది.

⦿ ఆడి A2

Advertisement

ఆడి B సెగ్మెంట్ ఎంట్రీ కొత్తలో అనుకున్న స్థాయిలో సక్సెస్ లేదు. ఆ తర్వాత మెర్సిడెస్ A క్లాస్ మార్కెట్ లోకి రావడంతో పోటీకి తట్టుకోలేకపోయింది. అయినప్పటికీ శీతాకాలంలో వెళ్లేందుకు అనుగుణంగా ఉంటుంది. A2 అల్యూమినియంతో తయారు చేయబడింది. శీతాకాలంలో రోడ్లపై చక్కగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది. చక్కగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. సీట్ల మధ్య మంచి స్పేస్ ఉంటుంది. విజుబులిటీ బాగుంటుంది.

⦿ ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్

ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్‌ కూడా శీతాకాలం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. సాధారణ హ్యాచ్‌ బ్యాక్ కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. బ్యాడ్ వెదర్ లోనూ చక్కగా ప్రయాణిస్తుంది. వెనుక వీల్స్ ను నడిపించే విస్కాస్ కప్లింగ్ సమస్య ఉన్నప్పటికీ వింటర్ కూడా ఈ కారు సూటవుతుంది.

⦿ ఫియట్ పాండా 4×4

Advertisement

ఈ మోడల్ 2004లో ప్రారంభం అయ్యింది. తొలి తరం కార్లు 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చాయి. ఇరుకైన రోడ్లను ఈజీగా దాటుతుంది. బురద, మంచులోనూ తేలికగా ప్రయణిస్తుంది.

⦿ మినీ కూపర్

మినీ కూపర్ కూడా శీతాకాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. మంచు సమయంలో గ్రౌండ్ క్లియరెన్స్‌ లో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మంచి స్టీరింగ్ అనుభూతి, అద్భుతమైన బ్యాలెన్సింగ్ ఉంటుంది. వర్షంలో, మంచుతోనూ ఈ కారు చక్కగా నడుస్తుంది.

⦿ రెనాల్ట్ సీనిక్ RX4

రెనాల్ట్ సీనిక్ RX4 కూడా శీతాకాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. వర్షం కురిసినప్పుడు కూడా ఈ కారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది.  ఆధునిక క్రాస్‌ ఓవర్‌లతో పోలిస్తే మంచి ఫీచర్లతో ఉంటుంది. ఐదు సీట్లు, స్ప్లిట్ టెయిల్‌ గేట్, క్యాబిన్ స్టోరేజ్ లోడ్ తో అనుకూలంగా ఉంటుంది.

Read Also: ఇండియన్ మార్కెట్ ను ఏలిన టాప్ కార్లు, ప్రజలు ఇప్పటికీ వాటిని మర్చిపోలేరు తెలుసా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×