Upasana Konidela: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా, రామ్ చరణ్ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక ఉపాసన తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉండే ఉపాసన (Upasana) సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే నేడు రామ్ చరణ్ (Ramcharan)పుట్టినరోజు కావడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా రామ్ చరణ్ కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పెద్ద ఎత్తున హోమాలు చేయించారు అలాగే అన్నదానం కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇక నేడు చరణ్ పుట్టినరోజు కావడంతో చిరంజీవి చిన్నప్పుడు తన కొడుకు చరణ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన కొడుకు ఎదుగుదలను తెలియజేస్తూ ఎంతో గర్వపడ్డారు. ఇలా రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటో పై ఉపాసన కామెంట్ చేస్తూ ప్రస్తుతం అన్విరా (Anveera)అచ్చం రామ్ చరణ్ పోలికలతోనే ఉందని తెలిపారు.
ఇలా తన కుమార్తె అన్వీరా దేవి పోలికలను ఉపాసన బయట పెట్టడంతో తమ చిన్న కూతురు ఎలా ఉంటుందో అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ దంపతులకు ముగ్గురు సంతానం అనే సంగతి తెలిసిందే. ఈ దంపతులు పెళ్లయిన పది సంవత్సరాలకు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జనవరిలో ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కవల పిల్లలలో ఒక అబ్బాయి జన్మించగా, మరొకరు అమ్మాయి జన్మించారు. రామ్ చరణ్ ఉపాసన ఈ ఇద్దరు పిల్లలకు తమ కుటుంబ సభ్యుల పేర్లు కలిసేలా కొడుకుకు శివ రామ్ కొణిదెల అని నామకరణం చేయగా, కూతురికి అన్విరా దేవి అని నామకరణం చేశారు.
ఇలా ఈ దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లితండ్రులు అయ్యేటప్పటికీ ఇంతవరకు తమ పిల్లలు ఎలా ఉంటారనే విషయాలను మాత్రం ఉపాసన రాంచరణ్ ఎక్కడ వెల్లడించలేదు . బయటకు వచ్చిన తమ పిల్లల ఫేస్ కనిపించకుండా ఈ దంపతులు ఎంతో జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చరణ్ పిల్లలు ఎలా ఉంటారు ఎవరి పోలికలతో ఉన్నారు అనే విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్న నేపథ్యంలో ఉపాసన తన చిన్న కూతురు అచ్చం రామ్ చరణ్ పోలికలతోనే ఉందని చెప్పడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Actress Anjali Pawan: విడాకులకు సిద్ధమైన బుల్లితెర నటి అంజలి పవన్.. అసలేమైందంటే?