E-Paper
Advertisement

Actress Anjali Pawan: విడాకులకు సిద్ధమైన బుల్లితెర నటి అంజలి పవన్.. అసలేమైందంటే?

Actress Anjali Pawan: విడాకులకు సిద్ధమైన బుల్లితెర నటి అంజలి పవన్.. అసలేమైందంటే?
Advertisement

Actress Anjali Pawan: బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అంజలి (Anjali)ఒకరు. మొగలిరేకులు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు చానల్లో వివిధ సీరియల్స్ ద్వారా మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో అంజలి బిజినెస్ లోకి అడుగుపెట్టడంతో బుల్లితెర సీరియల్స్ కాస్త దూరంగా ఉన్నారు. ఇలా సీరియల్స్ కు దూరంగా ఉన్న అంజలి పవన్(Pawan) బుల్లితెర కార్యక్రమాలలో మాత్రం పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్(Mad For Each Other) అనే కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంజలి పవన్ కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు.

విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న అంజలి..

ఇకపోతే ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వ్యక్తి తన విడాకుల (Divorce) నిర్ణయాన్ని బయటపెట్టారు. పవన్ ఎక్కువగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అంజలి పూర్తిగా విసిగిపోయి తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. తాను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. తమ్ముడు అమ్మ తప్ప నాకు ఎవరూ లేరు ఇటీవలే అమ్మను కూడా దూరం చేసుకున్నాను. పవన్ నా సర్వస్వం అనుకున్నాను అలాంటిది నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఏదో తెలియని బాధ, దీంతో తన నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను..

Advertisement

ఈ విషయం గురించి పవన్ కి తెలియకుండా తాను లాయర్ ని కూడా కలిసినట్టు అంజలి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా లాయర్ తో మాట్లాడిన తర్వాత నా గురించి నేను ఆలోచించుకున్నాను నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఇప్పుడు నేను విడాకులు తీసుకుంటే నా పిల్లలకు కూడా అలాంటి ఫ్యామిలీని నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు లేని నాకు నా సర్వస్వం అనుకున్న వ్యక్తి నుంచి విడిపోవాలనుకోవడం ఏంటి అనే ధోరణిలో ఆలోచించానని, ఆ క్షణమే నేను చేస్తున్నది తప్పు అని తెలుసుకుని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని తెలిపారు.

?igsh=N3I0cmV5NWp2bTF5

Advertisement

విడాకులు తీసుకొని విడిపోవాలనుకున్న అంజలి తన తప్పును తెలుసుకొని తన భర్తతో ఇప్పుడు సంతోషంగా ఉంటున్న విషయాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. విడాకుల నిర్ణయాన్ని వెనక తీసుకున్న చాలా మంచి పని చేశారు . చాలా మంచిగా అర్థం చేసుకున్నారు అంటూ ఈ వీడియో పట్ల అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక అంజలి పవన్ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక బాబుకి అంజలి జన్మనిచ్చారు. బుల్లితెర కార్యక్రమాలతో పాటు వ్యాపారాలను చూసుకుంటూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ అంజలి తన కెరియర్ పట్ల ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు.

Also Read: Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు..ఆ అవార్డు డబ్బులు మొత్తం విరాళంగా ఇచ్చిన మెగాస్టార్!

Related News

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Big Stories

Advertisement
×