E-Paper
Advertisement

Upcoming Movies in Theater : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

Upcoming Movies in Theater : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..
Advertisement

Upcoming Movies in Theater : ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంటాయి. గతవారం వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చిన్నా, చితక సినిమాలతో కలిపి దాదాపు పది సినిమాలకు పైగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అసలు ఏయే సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయో ఒకసారి చూసేద్దాం…

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

సతీలీలావతి…

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల టైటిల్ పాత్రలో నటించిన చిత్రం సతీలీలావతి. ఈ మూవీలో దేవ్ మోహన్, వీకే నరేష్, వీటీవీ గణేషన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సిద్దిఖీ, జోషి తదితరులు నటించారు.. ఈ చిత్రానికి గాను తాతినేని సత్య దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో లావణ్య పాత్ర హైలెట్గా నిలుస్తుంది అని ఇప్పటివరకు రిలీజైన అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. మే 8న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది.. ఇక పెళ్లి తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్న లావణ్య కు ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసి పెడుతుందో చూడాలి..

గోదారి గట్టుపైన.. 

Advertisement

మేమ్‌ ఫేమస్‌ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ ప్రభాస్ ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం గోదారి గట్టు పైన.. సుభాష్‌ చంద్ర దీనికి దర్శకత్వం వహించారు.. ఈ మూవీ కూడా శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది..నిధి ప్రదీప్‌ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.

ఎం4ఎం.. 

టాలీవుడ్ డైరెక్టర్, హీరోగా మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అమెరికాకు చెందిన ముద్దుగుమ్మ జో శర్మ. ఈమెకు ఇదే మొదటి సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ చిత్రం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. సంబీత్ ఆచార్య ఇందులో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా మే 8న థియేటర్లలోకి రాబోతుంది..

రేజర్..

Advertisement

ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన రవి బాబు సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకుల్లో తెలియని ఉత్కంఠను నెలకొల్పేలా సినిమాలను తెరికెక్కిస్తూ ఆకట్టుకుంటున్నాడు.. ఈయన రేజర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకట్‌ మరోసారి తన టాలెంట్ నిరూపించుకోబోతున్నాడు.

ఇవి మాత్రమే కాదు.. హరుడు, విధి గీసిన విచిత్రం, ఏ ఫిల్మ్ బై గిరి వంటి సినిమాలతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అంతేకాదు.. రవితేజ నటించిన ‘కృష్ణ’, నాని సినిమా ‘నిన్ను కోరి’, శింబు హీరోగా నటించిన వల్లభ మూవీ కూడా మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాలలో ఏ మూవీ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×