E-Paper
Advertisement

నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!

నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!
Advertisement

Nithiin Flops: మాములుగా ఒక సినిమా ప్లాప్ అయితేనే తేరుకోవడం చాలా కష్టం. ఇక హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడితే హీరో ఇండస్ట్రీలో ఉంటాడా అంటే అనుమానమే. అదే డిజాస్టర్స్ లో డబల్ హ్యాట్రిక్ పడితే ఈపాటికి పెట్టె బేడా సర్దేయ్యాలి. కాని నితిన్ కి అదృష్టం మాములుగా లేనట్టుంది. ఒకప్పుడు వరుస హిట్లతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్, గత ఐదేళ్లుగా ఏకంగా ఆరు సినిమాలతో అట్టర్ ప్లాపులని మూట గట్టుకున్నా వరుస సినిమాలు వచ్చి పడుతున్నాయ్ మరి.

డబల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ 

Advertisement

అవును .. 2020లో వచ్చిన ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. 2021లో వచ్చిన ‘చెక్’, అదే ఏడాది వచ్చిన ‘రంగ్ దే’, 2022లో చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’, 2023లో వచ్చిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, 2025లో భారీ ఆశలు పెట్టుకున్న ‘రాబిన్ హుడ్’ (మార్చి 28), ‘తమ్ముడు’ (జూలై 4) సినిమాలు బొక్క బోర్లా పడ్డా మూడు సినిమాలు లైనప్ కావడం విశేషం.

ఆనంద్‌ కాంబోలో చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్

Advertisement

అయితే తాజాగా ఈ మూడింటిలో ఒకటైన వి.ఐ. ఆనంద్‌ కాంబోలో చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయిందన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో జోరందుకున్నాయ్. వాస్తవానికి నితిన్ – వి.ఐ. ఆనంద్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఏర్పడ్డాయ్. కానీ సిట్యుయేషన్ చూస్తుంటే సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తుంది. అసలే ఆనంద్ కథలు హై-లెవల్ కాన్సెప్ట్ తో ఉంటాయ్. ఇక నితిన్ కోసం డిజైన్ చేసిన కాన్సెప్ట్ కూడా అలాంటిదే అని, అందుకోసం భారీ బడ్జెట్ అవసరమని కానీ ‘తమ్ముడు’ రిజల్ట్ చూసిన ఏ నిర్మాత కూడా నితిన్ మీద అంత రిస్క్ చేసే పరిస్థితిలో లేరని సమాచారం. అవును …75 కోట్ల బడ్జెట్ పెడితే సింగిల్ డిజిట్ కలెక్షన్స్ కూడా రాలేవు మరి.

ALSO READ :ఇండస్ట్రీ నుంచి క్లీన్ స్వీప్.. పోసానిని దూరం పెట్టిన మేకర్స్.. కారణం అదేనా?

నితిన్ తప్పుకున్నాడా లేక హోల్డ్‌లో పెట్టాడా

అయితే మార్కెట్‌ను కన్సిడర్ చేస్తూ బడ్జెట్ తగ్గించి, సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేయాలని నితిన్ కోరగా, క్రియేటివ్ గా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాడట డైరెక్టర్ ఆనంద్. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నితిన్ తప్పుకున్నాడా లేక హోల్డ్‌లో పెట్టాడా అన్నది అర్థం కాక డైలామాలో పడుతున్నారట నితిన్ ఫ్యాన్స్. ఇక నితిన్ డిసీషన్ కోసం వెయిట్ చేయలేక ఈ కథను మరో హీరోకి ఫార్వార్డ్ చేశాడని తెలుస్తుంది. నితిన్ మాత్రం ఆ కథను వదులుకోలేక, అలాగని ముందుకు వెళ్లలేక తెగ సతమతమైపోతున్నాడట.

ఇద్దరు డైరెక్టర్లతో కొత్త సినిమాను గ్రాండ్‌గా

అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తో బోల్తా పడ్డ నితిన్ ఇప్పుడు రూటు మార్చి కొత్త దర్శకులను నమ్ముకోవడం విశేషం. ఈ క్రమంలో నిన్ననే (మే 6, 2026) సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నారి సిరిసవాడ, సోమశేఖర్ అనే ఇద్దరు డైరెక్టర్లతో కొత్త సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. ఇక రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మే రెండో వారం నుంచి మొదలవుతోంది కూడా.

దీనితో పాటు ‘ఆయ్’ ఫేమ్ అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను 2027 సంక్రాంతి టార్గెట్‌గా ఓకే చేశాడు. వి.ఐ. ఆనంద్ లాంటి క్రేజీ డైరెక్టర్‌ను పక్కన పెట్టి, కేవలం బడ్జెట్ భయంతో చిన్న సినిమాల వైపు వెళ్లడం నితిన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేక మరోసారి ఆయన జడ్జిమెంట్ తప్పి కెరీర్‌ను రిస్క్‌లో పడేస్తున్నాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

 గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే

ఒకవేళ వి.ఐ. ఆనంద్ ఇదే సినిమాని మరో హీరోతో హిట్ కొడితే మాత్రం నితిన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. చూడాలి మరి వినిపిస్తున్నట్టుగా మరో హీరోకి వెళ్తుందా ..లేక నితినే నిర్మాతగా స్వయంగా రంగంలోకి దిగుతాడా!

ALSO READ :కర్ణాటకలో ఓకే.. మరి తమిళనాడులో ఎందుకు కాదు? గవర్నర్‌ను నిలదీసిన హీరో విశాల్!

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×