BigTV English

Spirit Movie : డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. బర్త్ సర్ ప్రైజ్ లోడింగ్..

Spirit Movie : డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. బర్త్ సర్ ప్రైజ్ లోడింగ్..

Spirit Movie : అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేర్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ సినిమా తర్వాత బిజీ అవుతారని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్లో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో పాటు భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ గురించి బయటకు వచ్చిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందంటూ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు..


ప్రభాస్ బర్త్ డే సర్ప్రైజ్ రెడీ..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయన ఆ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ షూటింగ్ సెట్స్ మీద ఉందన్న విషయం తెలిసిందే.. ఈనెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. మూవీ నుంచి పోస్టర్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ని వదులుతుందో చూడాలి.

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ శృతి రియల్ లైఫ్ లో ఎన్ని ట్విస్టులో..


స్పిరిట్ షూటింగ్ అప్డేట్.. 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అర డజను సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఏడాదికి ఒక సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది పూర్తిగా వస్తున్న సరే ఇప్పటివరకు ఈయన నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజి సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా థ్రిల్లింగ్, పవర్‌ఫుల్ యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Dude Trailer: సరికొత్తగా డ్యూడ్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

Theater Movies : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి పైనే ఫోకస్..

Siva Raj Kumar : తొక్కిసలాటపై శివన్న రియాక్షన్… విజయ్ ఆలోచించాల్సింది అంటూ

Nayanthara: ఇండస్ట్రీ @22 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న సూపర్ స్టార్

Shriya Reddy: మగాళ్ళ మధ్య ఆ ఫీలింగ్ రావాలంటే ఇలా చేయాల్సిందే.. ఇదేంట్రా బాబు!

Payal Ghosh: 9 ఏళ్లుగా భరించలేకపోతున్నా.. కా**ఛ తీరలేదంటూ హీరోయిన్ బోల్డ్ కామెంట్!

Rishab Shetty: హాట్ టాపిక్ గా మారిన రిషబ్ శెట్టి ఇల్లు.. ఖరీదే కాదు.. ప్రత్యేకతలు కూడా!

Big Stories

×