PSL 11 New Teams: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా దాదాపు ఫిక్స్ చేసింది. ఏప్రిల్ మాసంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను ( Pakistan Super League 2026) ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభించే దిశగా పిసిబి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వ్యూవర్ షిప్ తగ్గించే కుట్రలో భాగంగానే, ఏప్రిల్ లో ఈ టోర్నమెంట్ ను పాకిస్థాన్ నిర్వహించనుందట. రెండు కొత్త జట్లను కూడా ఈ సారి రంగంలోకి దింపనున్నారట.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు కౌంట్ డౌన్ షురూ అయింది. వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ నుంచి ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. మే చివరి వరకు ఈ టోర్నమెంట్ కొనసాగించనున్నారు. సరిగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం సమయంలోనే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 11వ సీజన్ లో ప్రారంభించేలా కనిపిస్తోంది. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ను చాలామంది చూడాలన్న, కుటీల కోరికతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలా చేస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు ఆరు జట్లతో టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇప్పుడు మరో రెండు జట్లను రంగంలోకి దించనుందట.
ఇప్పటి వరకు 10 సీజన్లు పూర్తి కాగా, అందులో ఆరు జట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి చేరనుంది. హైదరాబాద్, మిర్పూర్ కాస్, సియాల్ కోటు , పైసలాబాద్ లాంటి నగరాల నుంచి రెండు జట్లు ఫైనల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్ సిటీ నుంచి కొత్త జట్టు వస్తే, హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ ఇండియాలో కూడా ఉంది. అక్కడినుంచి సన్రైజర్స్ రంగంలోకి దిగుతోంది. అటు హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో కొత్త జట్టు వస్తే హాట్ టాపిక్ కావడం గ్యారెంటీ. ఇక ఇప్పటివరకు ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, “లాహోర్ ఖలందర్స్ష, ముల్తాన్ సుల్తాన్స్, పేషావర్ జల్మీ లాంటి జట్లు బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్లే. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ పూర్తయిన వెంటనే ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మార్చి 15వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మే 31వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం 84 మ్యాచులు జరగనున్నాయి. 78 రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగుతుంది.
Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో పర్మిషన్…దుబాయ్ లో వదిలేశాడుగా !
🚨 PSL 11 is poised for a thrilling April–May return, coinciding with the IPL, and is set to expand with two exciting new teams. #PSL11 pic.twitter.com/fFvpWzcJk0
— CricFollow (@CricFollow56) October 8, 2025