Gundeninda Gudigantalu Shruthi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. అందులో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు కూడా ఒకటి. మధ్యతరగతి కుటుంబంలోని కోడలు తన కష్టాలను అత్త పెట్టే బాధలను ఎలా భరిస్తుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. ఆ కోడలు జనాలకు బాగా కనెక్ట్ అయింది. అత్త పోరుని భరించలేక కోడలు ఎదురు తిరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది.. ఈ సీరియల్ లో ముగ్గురు కోడళ్లలో ఒకరుగా నటించింది శృతి. డబ్బున్న అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న క్యారెక్టర్ లో శ్రుతి నటించినది. శృతి రియల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె సీరియల్స్ మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో కూడా నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎన్ని సినిమాల్లో నటించిందో ఒకసారి తెలుసుకుందాం..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో శృతి పాత్రలో నటించిన విహారిక చౌదరి.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే కేవలం సీరియల్స్ తో మాత్రమే కాదు అటు సినిమాలలో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ లో నటిస్తున్న ఈ అమ్మడు.. ముందుగా సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు కూడా చేసింది.. రొమాంటికి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ‘వారధి’ సినిమాలో భర్త-ప్రియుడి మధ్య ఇబ్బందులు ఎదుర్కొనే రోల్ చేసింది. అలాగే గతేడాది వచ్చిన ‘కాలం రాసిన కథలు’, వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనే మూవీస్ లో కూడా నటించింది. నేను నా రాక్షసి, మేడ్ ఫర్ ఈచదర్, బుల్లబ్బాయ్ ఫ్రమ్ బుర్రలంక అనే వెబ్ సిరీస్ లలో కనిపించింది. ఇలా ఎన్నో సినిమాలలో వెబ్ సిరీస్లలో నటించిన ఈమె ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
Also Read: గ్రాండ్ గా బతుకమ్మ సంబరాలు.. కొడుకులకు క్లాస్ పీకిన రామరాజు.. నర్మద ప్లాన్ సక్సెస్..
శృతి అలియాస్ విహారికా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె సీరియల్సు సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతుంది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా బిజీగా ఉన్నా విహారిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకు పెళ్లయింది. అయితే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆమె భర్త పేరు రాజ్. ఇద్దరూ బిజీ లైఫ్ ని గడుపుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా రొమాంటిక్ ట్రిప్ లు వేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తన భర్త సపోర్ట్ వల్లే సీరియల్స్ సినిమాలు చేస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది విహారికా.. తన మ్యారేజ్ లైఫ్ లో ఎన్నో ట్విస్టులు కూడా ఉన్నాయని ఆమె గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సినిమాలనుంచి సీరియస్ లోకి వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న సంధ్యారాగం సీరియల్ లో కూడా నటిస్తుంది. ప్రతి రోజు 25 వేలు చార్జ్ చేస్తుందట. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటుందట. అంటే నెలకు ఈ సీరియల్ ద్వారా లక్షలు సంపాదిస్తుంది. సీరియల్స్ మాత్రమే కాదు. అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఫోటోలు నెట్టింట వైరల్ అవుతాయి.