E-Paper
Advertisement

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఆ రేంజ్ లో ఉందా? ఉపేంద్ర మాటలు వెనక ఆంతర్యం ఏంటి?

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఆ రేంజ్ లో ఉందా? ఉపేంద్ర మాటలు వెనక ఆంతర్యం ఏంటి?
Advertisement

Andhra King Taluka : కొంతమంది దర్శకులకు మాత్రమే విలక్షణమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎంత విలక్షణమైన ఆలోచనలో వస్తుంటాయంటే వాళ్లు తీసిన సినిమాలు ఇప్పటికీ కూడా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇండియాలో ఉన్న అటువంటి దర్శకులలో ఉపేంద్ర ఒకరు. తను తీసిన ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు ఇప్పటికీ కూడా చూస్తుంటే చాలా రిలవెంట్ గా అనిపిస్తాయి. అలా ఊహించడం అనేది మామూలు విషయం కాదు.

అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖ దర్శకులు దర్శకుడు ఉపేంద్రకు అభిమానులు అయిపోయారు. అయితే ఒకపక్క దర్శకుడుగా సినిమాలు చేస్తూనే మరో పక్కన నటుడుగా కూడా నటిస్తూ ఉంటారు. అప్పుడు తెలుగు సినిమాలు కూడా ఎక్కువగా చేసేవాళ్ళు కానీ కొంతకాలం తర్వాత మంచి సినిమాల మాత్రమే చేయాలి అనే ఉద్దేశంతో కథ నచ్చితేనే సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే.

ఆ రేంజ్ లో ఉండబోతుంది 

Advertisement

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఉపేంద్ర ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ఈవెంట్ వైజాగ్ వేదికగా నేడు నిర్వహించారు. ఈవెంట్ లో హాజరైన ఉపేంద్ర కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సినిమా గురించి చేశారు.

ఉపేంద్ర తీసిన చాలా సినిమాల ప్రస్తావన తీసుకొస్తూ, వాటన్నిటి కంటే కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. నేను సినిమా చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను మీరు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇది అవ్వబోతుంది అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కథ నాకు విపరీతంగా నచ్చడంతోనే ఈ సినిమా చేశాను అంటూ మాట్లాడారు.

ఇది కేవలం అభిమాని కథ మాత్రమే కాదు 

Advertisement

ఈ సినిమా కేవలం అభిమానికి మరియు తన హీరోకి మధ్య జరిగే కథ అని అందరూ అనుకుంటున్నారు. లేదు ఈ సినిమా చూసి కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు ఒక మంచి పాయింట్ దర్శకుడు ఈ సినిమాతో చెప్పాడు అంటూ మహేష్ బాబుని పొగిడారు.

రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో కనిపించారు ఉపేంద్ర. సినిమాలో ఆయన పాత్ర కొంతమేరకు వర్కౌట్ అయింది కాని కంప్లీట్ సినిమా అంత ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అందరి అంచనాలు కూడా ఆంధ్ర కింగ్ తాలుక సినిమా మీద ఉన్నాయి. సినిమా నవంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Ram Pothineni: పడ్డాం అని తెలుసు, వస్తున్నాం వడ్డీతోపాటు తిరిగిస్తాం

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

Big Stories

Advertisement
×