E-Paper
Advertisement

Karthika Deepam : రామ్ చరణ్ పెద్ది స్టెప్ రీ క్రియేట్ చేసిన డాక్టర్ బాబు

Karthika Deepam : రామ్ చరణ్ పెద్ది స్టెప్ రీ క్రియేట్ చేసిన డాక్టర్ బాబు
Advertisement

Karthika Deepam : కొన్ని సీరియల్స్ కి ఎప్పుడు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటూనే ఉంటుంది. అటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. తెలుగు ప్రేక్షకులు సీరియల్స్ కి ఎంతలా కనెక్ట్ అయిపోతారు అంటే అక్కడ జరుగుతున్న డ్రామా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నట్టే ఫీల్ అవుతారు. కొంతమంది టీవీ చూస్తూనే ఆ నటుల నుండి తిడుతూ ఉంటారు. అంటే ఎమోషనల్ గా ఆ పాత్రలకు అంతలా కనెక్ట్ అయిపోతారు.

ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ లో డాక్టర్ బాబు దీప పాత్రలు బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయాయి. సీరియల్స్ చూడని వాళ్ళు పట్టించుకోరు గాని ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్లను ఇంట్లో మనుషుల్లాగే భావిస్తారు. ఇక ప్రస్తుతం డాక్టర్ బాబు పాత్ర చేసిన నిరుపమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

రామ్ చరణ్ స్టెప్ రీ క్రియేట్ 

Advertisement

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ 26 2026లో విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మార్చి 25న పలుచోట్ల ప్రీమియర్ షోస్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చికిరి అనే ఒక పాట విడుదలైంది. ఈ పాట విన్నప్పుడు పెద్దగా ఎవరికి ఏమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పాట ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిపోయింది. దాదాపు 100 మిలియన్స్ దగ్గరగా వ్యూస్ ఆ పాటకు ఉన్నాయి.

Advertisement

ఎక్కడ చూసినా కూడా ఆ స్టెప్పు మళ్లీ రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కార్తీకదీపం ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ కూడా ఆ పాటకు స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

రెహమాన్ ను ఒప్పించడం గ్రేట్ 

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అతని మ్యూజిక్ వింటేనే ఒక ప్రశాంతత కలుగుతుంది. అయితే తెలుగులో కొమరం పులి సినిమా తర్వాత ఇప్పటివరకు మ్యూజిక్ చేయలేదు ఏఆర్ రెహమాన్. ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయాలి అంటే ఆ కథ విపరీతంగా అతనికి నచ్చాలి.

కొన్నిసార్లు కథ నచ్చకపోతే ఏ ఆర్ రెహమాన్ సినిమాలు చేయరు. అయితే పెద్ది సినిమా కథ వినగానే ఏఆర్ రెహమాన్ ఫిదా అయిపోయారట. పెద్ది సినిమా కి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా కావాలి అన్నప్పుడు సుకుమార్ ఆశ్చర్య పోయారట. మొత్తానికి అనుకున్నట్లుగానే తన సినిమాకు ఏఆర్ రెహమాన్ ను తీసుకొచ్చారు. రెహమాన్ కూడా అదే స్థాయిలో సంగీతం అందిస్తూ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టారు. కేవలం పాట మాత్రమే కాకుండా. ఈ సినిమాకి సంబంధించిన వీడియో లో బ్యాక్గ్రౌండ్ కూడా బాగా వర్కౌట్ అయింది.

Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా ఫైనల్ డ్యూరేషన్ ఇదే, కం బ్యాక్ ఇస్తాడా?

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×