E-Paper
Advertisement

Upendra: ఆ సినిమా త్రివిక్రమ్ గారి కోసమే చేశా, మరి కథ వినలేదా?

Upendra: ఆ సినిమా త్రివిక్రమ్ గారి కోసమే చేశా, మరి కథ వినలేదా?
Advertisement

Upendra: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా అప్పట్లో డబ్బింగ్ రూపంలో విడుదలయ్యేవి. ఎవరు ఊహించని కాన్సెప్ట్స్ను ఆ కాలంలోనే ఊహించి అద్భుతమైన సినిమాలు తీశాడు ఉపేంద్ర. ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న చాలామంది దర్శకులకు ఉపేంద్ర ఒక ఇన్స్పిరేషన్. చాలామంది దర్శకులు ఉపేంద్ర కి దర్శకుడుగా కూడా అభిమానులు అయ్యారు.

ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఉపేంద్ర కి ఎంత పెద్ద అభిమాని అని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పలు సందర్భాల్లో ఉపేంద్ర కి వీరాభిమాని అని మాట్లాడారు. అయితే తెలుగులో ఎక్కువగా స్ట్రైట్ సినిమాలు చేయరు ఉపేంద్ర. అసలు అలా చేయకపోవడానికి కారణం ఏంటో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

సినిమాలు చేయకపోవడానికి కారణం 

Advertisement

ఉపేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కన్నడలో మూడు నాలుగు నెలలు ఒక సినిమా కోసం టైం కేటాయిస్తూ ఉంటాను. అప్పుడు ఆ సినిమా జరుగుతున్న తరుణంలో కొంచెం గ్యాప్ లో ఇక్కడికి వచ్చి సినిమా చేయాలి. అప్పట్లో ఇక్కడ సినిమా చేసే వాడిని కాదు అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

అందుకనే ఒక పెద్ద సంస్థ మంచి కథ ఇవన్నీ ఉంటేనే, నాకు సంతృప్తిగా అనిపిస్తేనే తెలుగు సినిమాలు చేస్తాను అని చెప్పారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా లోని మీ పాత్ర హ్యాపీగా అనిపించిందా అని ప్రశ్న ఎదురయింది ఉపేంద్రకు. అయితే ఆ సినిమా కేవలం నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసమే చేశాను అంటూ చెప్పారు.

నేను త్రివిక్రమ్ అభిమానిని 

Advertisement

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాకి సంబంధించి నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని మామూలుగా మాత్రమే అని చెప్పారు. ఆయన చాలా గొప్ప రైటర్ ఆయన రైటింగ్ కి నేను పెద్ద అభిమానిని. ఆయన వెంకటేష్ తో చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాని నేను గౌరమ్మ అని కన్నడలో మళ్ళీ రీమేక్ చేశాను అంటూ చెప్పారు.

త్రివిక్రం రైటింగ్ మీద నాకు ఎలానో నమ్మకం ఉంది కాబట్టి, ఆయనతో ఒక జర్నీ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతోనే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి సంబంధించి పూర్తిస్థాయిలో కథ వినకపోయినా కూడా కేవలం త్రివిక్రమ్ కోసమే చేశాను అని చెప్పారు. అయితే త్రివిక్రమ్ను అలా నమ్మినందుకు కూడా మంచి పాత్రను ఉపేంద్ర కోసం డిజైన్ చేశాడు గురూజీ. ఇక ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో ఉపేంద్ర నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 27వ తారీఖున విడుదలకు సిద్ధమవుతుంది.

Also Read: With Love : హీరోగా మారిపోయిన మరో డైరెక్టర్, క్యూట్ లవ్ స్టోరీ సెట్ చేసుకున్నాడు

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×