E-Paper
Advertisement

IBomma Ravi: వాడు చేసింది తప్పే, కానీ నిర్మాతలది దర్శకులు ది కూడా పెద్ద తప్పు ఉంది

IBomma Ravi: వాడు చేసింది తప్పే, కానీ నిర్మాతలది దర్శకులు ది కూడా పెద్ద తప్పు ఉంది
Advertisement

IBomma Ravi: గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఐ బొమ్మ రవి గురించి టాపిక్ నడుస్తూనే ఉంటుంది. కొంతమంది తాను చేసింది తప్పు అని సినిమాకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కొంతమంది మాత్రం అతన్ని ఒక రాబిన్ హుడ్ ట్రీట్ చేస్తున్నారు. రవి చేసిన పని పూర్తిస్థాయిలో తెలియని వాళ్లు మాత్రమే అతనికి ఎలివేషన్స్ ఇస్తున్నారు. మనకి పైరసీ సినిమా చూపిస్తూ మన వ్యక్తిగత సమాచారాన్ని అతను పొందుకొని వ్యాపారం చేశాడు. అయితే ఈ విషయం ఎవరికీ పూర్తిస్థాయిలో అర్థం కావడం లేదు.

అతను చేసిన పైరసీ వలన సినిమా పరిశ్రమ లోని ప్రముఖులు మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమని నమ్ముకున్న కార్మికులకు కూడా నష్టం జరిగింది. థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. చాలా సినిమా థియేటర్లు మూత పడిపోయే స్థాయికి వచ్చాయి. చేసినది పైరసీ అయినా కూడా దానిమీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అందరూ మాట్లాడటం లేదు.

దర్శక నిర్మాతలు కూడా తప్పే 

Advertisement

ఐ బొమ్మ రవి ఫాదర్ నో కొంతమంది వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయాన్ని సేకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అతనికి వాళ్ళ అమ్మ బుద్దే వచ్చింది వాళ్ళ అమ్మది అలాంటి మైండ్ సెట్ ఏ అంటూ చెప్పారు.

అయితే రవి ఫాదర్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాడు చేసింది తప్పే. దానితోపాటు హీరోనిర్మాతలది కూడా నాకు తెలిసి చాలా పెద్ద తప్పు ఉంది అని చెప్పాడు రవి ఫాదర్.

Advertisement

అప్పట్లో వందలు వేలు ఇస్తేనే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు లాంటివాళ్ళు యాక్టింగ్ చేశారు. ఇప్పుడు హీరోలకి కోట్లు ఎందుకండీ? వాళ్లకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది నిర్మాతల తప్పు.

కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి 

ఎన్ని కోట్లు ఇస్తేనే యాక్ట్ చేస్తాను అనేవాళ్లను వదిలేయాలి కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పారు. రాజశేఖర్ చాలా బాగా యాక్ట్ చేస్తారు కానీ ఆయనను వెనక్కి తొక్కేశారు. సుమన్ ఉన్నాడు ఆయన కూడా బాగా యాక్ట్ చేస్తారు ఆయన్ని వెనక్కి తొక్కేశారు. టాలెంట్ కి గౌరవం ఇవ్వాలి. ఎన్నో కాలేజెస్ కి వెళ్తే చుక్కలాంటి పిల్లలు హీరోల్లా ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. అని చెబుతూ మొత్తానికి రవి చేసిన పనిని నేను సమర్ధించడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు రవి ఫాదర్. అయితే రవి ఫాదర్ మాట్లాడిన మాటలను కూడా కొంతమంది సమర్థించే వాళ్లు ఉన్నారు.

Also Read : Upendra: ఆ సినిమా త్రివిక్రమ్ గారి కోసమే చేశా, మరి కథ వినలేదా?

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×