E-Paper
Advertisement

Prashanth Kishore: బిహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నేను చేసిన తప్పు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Prashanth Kishore: బిహార్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే నేను చేసిన తప్పు: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Prashanth Kishore: ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ ఘోర పరాజయం పాలవడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికల్లో పార్టీకి కనీసం 4 శాతం ఓట్లు కూడా రాకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే పెద్ద పొరపాటని ఆయన అంగీకరించారు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం ఒక తప్పుగా భావించవచ్చు. మా పార్టీకి 4 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే ఇంకా ఎంతో కష్టపడాల్సి ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, డిపాజిట్లు కోల్పోవడం తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని అన్నారు.

Advertisement

అయితే, ఈ ఓటమితో తాను వెనకడుగు వేయబోనని పీకే స్పష్టం చేశారు. “బిహార్‌ను గెలవకుండా నేను వెనక్కి తగ్గేదే లేదు. ఇందుకు ఎంత సమయం పట్టినా సరే, నా పోరాటం ఆపను” అని ధీమా వ్యక్తం చేశారు. తన అంచనాలు తప్పాయని, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యామని నిజాయితీగా ఒప్పుకున్నారు. భవిష్యత్తులో మరింత పగడ్బందీగా వ్యూహాలు రచిస్తామని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, నవంబర్ 2025లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించగా, జన్ సురాజ్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ‘జన్ సురాజ్ పార్టీ’ బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.

Read Also: Sleep Hours: రోజూ 5 గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీరు సూపర్ హీరోలే, ఎందుకంటే?

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×