E-Paper
Advertisement

Urvasi Rautela: 31వ బర్తడే కి.. 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్ల జరిపిన బాలకృష్ణ హీరోయిన్..!

Urvasi Rautela: 31వ బర్తడే కి.. 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్ల జరిపిన బాలకృష్ణ హీరోయిన్..!
Advertisement

Urvasi Rautela: బాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలా తన పుట్టినరోజును ఈసారి చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ మధ్యనే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్లో కనిపించింది. సాధారణంగా సినీ తారలు పుట్టినరోజు అంటే పెద్ద పార్టీలు, సెలబ్రేషన్లు చేస్తారు. కానీ ఉర్వశి మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించారు. తన 31వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లా బాగేశ్వర్ ధామ్‌లో 251 మంది అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నారు. పార్టీ చేసుకోవడం కంటే మంచి పని చేయడం గొప్పదని ఆమె మరోసారి నిరూపించారు.

బాగేశ్వర్ ధామ్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఉర్వశి పరోక్షంగా పాల్గొని ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆమెను విపరీతంగా ప్రశంసిస్తున్నారు. “హార్ట్ ఆఫ్ గోల్డ్: ఉర్వశి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల సమాజానికి మంచి సందేశం వెళ్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ఉర్వశి రౌతేలా బాలీవుడ్‌లో గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. ఆమెకు సినిమాల కంటే అందం, ఫ్యాషన్ సెన్స్ వల్ల ఎక్కువ గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. తరచూ తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు.

ఉర్వశి జననం 25 ఫిబ్రవరి 1994న ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్‌లో జరిగింది. చిన్నప్పట్లో ఆమె ఐఏఎస్ అధికారిగా కావాలని కలలు కన్నారు. కానీ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారింది. 2009లో మిస్ టీన్ ఇండియా టైటిల్ గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

2013లో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సీనియర్ నటుడు సన్నీ డియోల్ సరసన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమా ద్వారా ఆమెకు తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా, ఉర్వశికి మంచి అనుభవం ఇచ్చింది.

తాజాగా చేసిన సేవా కార్యక్రమంతో ఉర్వశి మరోసారి వార్తల్లో నిలిచారు. నటిగా మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇలాంటి మంచి పనులు మరింత మంది సెలబ్రిటీలకు ప్రేరణగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ALSO READ: Rukmini Vasanth: సింపుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న రుక్మిణీ వసంత్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×