E-Paper
Advertisement

Ustaad Bhagat Singh Runtime: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉగాదికి ఉస్తాద్ జాతరే..

Ustaad Bhagat Singh Runtime: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉగాదికి ఉస్తాద్ జాతరే..
Advertisement

Ustaad Bhagat Singh Runtime: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలుస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రాన్ని వీక్షించి, దీనికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమాలో ఎక్కడా అనవసరమైన కట్స్ లేకుండా, పక్కా కమర్షియల్ హంగులతో ఈ చిత్రం రూపొందిందని సెన్సార్ సభ్యుల నుండి సానుకూల స్పందన వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

Read also-Mouli Movie: పాన్ ఇండియా బ్యానర్లో ‘లిటిల్ హార్ట్స్’ మౌళి నెక్స్ట్ సినిమా!.. దర్శకుడు ఎవరంటే?

రన్ టైమ్ ఎంతంటే?

Advertisement

సినిమా నిడివి విషయానికి వస్తే, ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా కథను వేగంగా నడిపించేలా ఎడిటింగ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంది. సినిమా మొత్తం నిడివి సుమారు 2 గంటల 31 నిమిషాల 28 సెకన్లుగా ఉంది. ప్రథమార్ధం (First Half): 1:10:09 మొదటి భాగం గంటా పది నిమిషాల పాటు సాగుతుంది. ఇందులో భగత్ సింగ్ పాత్ర పరిచయం, పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే కామెడీ, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథ ముగుస్తుంది.

ద్వితీయార్థం (Second Half): 1:21:19 రెండో భాగం గంటా ఇరవై ఒక్క నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో అసలైన ఎమోషన్, విలన్‌తో మైండ్ గేమ్స్, మరియు భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పూర్తి చేశారు హరీష్ శంకర్. దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. మరో సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను హోరెత్తించడం ఖాయం.

Advertisement

Read also-Harish Shankar: మహేష్ బాబుపై చేసిన కామెంట్‌కు క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్.. అది చూడలేదంటూ..

అసలే పవర్ స్టార్ సినిమా అందులోనూ ఇద్దరు అగ్ర మ్యూజిక్ దర్శకులు సంగీతం అందించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పర్వదినం మార్చి 19,2026న సందర్భంగా విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. 2 గంటల 31 నిమిషాల పాటు సాగే ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన ఓ పాట్ ఆరా ఆఫ్ ఉస్తాద్ సినిమా లేదు అని తెలుస్తోంది. దీనిపై నిర్మాతల నుంచి అధికరిక ప్రకటన రావాల్సి ఉంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×