E-Paper
Advertisement

Gautam Gambhir: హ‌నుమంతుడి గుడిలో కాకుండా మ‌సీదులో టైటిల్ పెట్టాలా ? గంభీర్ సీరియ‌స్‌

Gautam Gambhir: హ‌నుమంతుడి గుడిలో కాకుండా మ‌సీదులో టైటిల్ పెట్టాలా ? గంభీర్ సీరియ‌స్‌
Advertisement

Gautam Gambhir: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs New Zealand, Final) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా టైటిల్ గెల్చుకుంది. ఇక ఈ టైటిల్ గెలిచిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, టైటిల్ గెలిచిన తర్వాత అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పక్కనే ఉన్న హనుమంతుని టెంపుల్ లో ట్రోఫీని పెట్టి పూజలు చేశారు. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

ట్రోఫీతో గుడికి వెళ్లడం పై మాజీ క్రికెటర్ విమర్శలు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన తర్వాత గుడికి ట్రోఫీని తీసుకు వెళ్లడంపై 1983 వరల్డ్ కప్ విజేత, టీఎంసీ పార్టీ కీర్తి ఆజాద్ ( Kirti Azad) సీరియస్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీతో హిందూ ఆలయానికి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కీర్తి ఆజాద్. టీమిండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని వెల్లడించారు. కేవలం ఒక మతాన్నిదో లేదా ఐసీసీ జై షా కుటుంబాన్నిదో కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మహమ్మద్ సిరాజ్ మసీదుకు లేదా సంజు శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకువెళ్తే బాగుండేదని చురకలు అంటించారు. ఒక మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని విమర్శలు చేశారు.

కీర్తి ఆజాద్ కు కౌంటర్ ఇచ్చిన గౌతమ్ గంభీర్

టి20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని హనుమంతుని గుడికి తీసుకు వెళ్లడంపై కీర్తి ఆజాద్ విమర్శలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) తాజాగా రివర్స్ అటాక్ చేశారు. హనుమంతుని గుడికి కాకపోతే మసీదుకు తీసుకువెళ్లాలా ? అంటూ సీరియస్ అయ్యారు గంభీర్. కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనవి అని మండిపడ్డారు. టీమిండియా తరఫున మైదానంలోకి దిగామంటే… తమ మధ్య ఎలాంటి మత విద్వేషాలు ఉండబోవు అని క్లారిటీ ఇచ్చారు. 140 కోట్ల భారతీయుల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు మాత్రమే క్రికెట్ ఆడుతామని తెలిపారు. క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి మతాలు వారివి.. కానీ ఇండియా తరఫున ఆడేటప్పుడు అందరం కలిసికట్టుగా.. మత విద్వేషాలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడతామని గంభీర్ క్లాస్ పీకారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు.. హనుమంతుడి గుడికి వెళ్లడంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ టోర్నమెంటుకు రాజకీయ రంగు పూస్తున్నారని సీరియస్ అయ్యారు.

Advertisement

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

Tags

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×