E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. వారం ముందే విడుదలకు సిద్ధం!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. వారం ముందే విడుదలకు సిద్ధం!
Advertisement

Ustaad Bhagat Singh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హీరోగా, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రెండోసారి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ లుక్ లో చూపించాలి అనుకున్నాను కానీ దాదాపు 80 శాతం పోలీస్ డ్రెస్ లోనే కనిపించారు. ఇక ఆయనను ఎలా అయితే నేను చూపించాలనుకున్నానో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అలాగే చూపించబోతున్నాను అంటూ హరీష్ శంకర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశారు

వారం రోజుల ముందే విడుదలకు సిద్ధం..

ఇకపోతే మార్చి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక హరీష్ శంకర్ మాటలతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను తెరపై చూస్తామా అని అభిమానులు కూడా ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పుడు అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వనున్నారు చిత్ర బృందం . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారం రోజుల ముందే అనగా ఈనెల 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

పండుగలను క్యాష్ చేసుకోబోతున్న ఉస్తాద్..

Advertisement

ఇకపోతే విడుదల తేదీని మార్చేసి .. ఏకంగా రెండు పండుగల సెలవు దినాలను ఉస్తాద్ క్యాష్ చేసుకోబోతోంది అని చెప్పవచ్చు. ఉగాదితో పాటు శ్రీరామనవమి సెలవు దినాలు కావడంతో ఆ రెండు రోజులను ఈ సినిమా చక్కగా క్యాష్ చేసుకోబోతోంది అనడంలో సందేహం లేదు. ఇక ఎలాగో ఉగాది పర్వదినాన పవన్ కళ్యాణ్ తన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా గబ్బర్ సింగ్ కి మించి ఉంటుందా? అసలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది? అనే విషయం తెలియాల్సి ఉంది.

మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చేసిన హరీష్ శంకర్..

ఇకపోతే ఈ చిత్ర బిజిఎం కోసం దేవి శ్రీ ప్రసాద్ ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే దేవిశ్రీప్రసాద్ బిజిఎంపై కాస్త అసంతృప్తిలో ఉన్న హరీష్ శంకర్ ఆయన స్థానంలో తమన్ ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

ALSO READ:Virosh Couple: కొత్త సాంప్రదాయానికి నాంది పలికిన విరోష్ జంట.. ఇది కదా అసలైన ట్రెండ్ సెట్టర్!

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విశేషాలు..

సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల మరొకవైపు టాలీవుడ్ లో పాగా వేయడానికి చూస్తున్నా రాశి ఖన్నా ఇద్దరు కూడా ఈ సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇద్దరూ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు ..మరి భారీ అంచనాల మధ్య కోటి ఆశలతో సక్సెస్ కోసం ఆరాటపడుతూ ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీ లీల, రాశి ఖన్నా ఈ చిత్రంతో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×