Virosh Couple: గత ఎనిమిది సంవత్సరాలుగా ఊరిస్తూ.. ఎట్టకేలకు అసలు నిజాన్ని బయటపెట్టి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న Rashmika mandanna).’ గీత గోవిందం’ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసి అప్పటినుంచి ప్రేమలో పడ్డ ఈ జంట విదేశాలకు వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేశారు. కనీసం అప్పుడైనా బయటపడతారు అనుకున్నారు కానీ రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని ఆశ్చర్యపరిచారు. కానీ ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న వివాహం చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇకపోతే వివాహం జరిగిన తర్వాత తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కేవలం 12 గంటల్లోనే రెండున్నర కోటికి పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించారు.
ఇకపోతే సాధారణంగా సెలబ్రిటీ జంటలు వివాహం చేసుకున్న తర్వాత తమ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తారు. ఇక ఆ తర్వాత హనుమాన్ కి వెళ్లడం అది వాళ్ళ పర్సనల్ లైఫ్.. కానీ ఇక్కడ విరోష్ మాత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ..ముఖ్యంగా తాము వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడమే కాకుండా తమ వివాహం సందర్భంగా సేవా దృక్పథంతో చేసిన పనులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం తర్వాత సేవా దృక్పథంతో కూడిన ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తమ వివాహం జరిగిన ఆనందాన్ని పదిమందితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ జంట దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రధాన నగరాలలో వేలాది మందికి స్వీట్ బాక్స్ లను పంపిణీ చేశారు. అలాగే 16 ప్రముఖ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలాగే గ్రీట్ & మీట్ పేరుతో విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేయడమే కాకుండా వారికి వడ్డించి మరీ తమ గొప్ప మనసును చాటుకున్నారు.
ALSO READ:Disha Patani: కల్కి 2లో తన పాత్ర పై హింట్ ఇచ్చిన దిశాపటాని.. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే?
ముఖ్యంగా విజయ్ తన స్వస్థలమైన తుమ్మనపేటలోని 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ లు ప్రకటించి తమ ఉదారత చాటుకున్నారు. ఏది ఏమైనా ఒక్క తమ వివాహం సందర్భంగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడం ఒక్క విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకే దక్కింది అంటూ పలువురు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే మూలాలను మర్చిపోకుండా తప్పకుండా తమ ఊరి అభివృద్ధికి తోడ్పడతామని.. తరచూ తమ ప్రాంతానికి వచ్చి సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకొని పరిష్కరిస్తామని విజయ్ దేవరకొండ హామీ ఇచ్చారు. అలాగే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లి కూడా ఇక్కడే చేస్తామని ఆయన స్పష్టం చేశారు.