E-Paper
Advertisement

Budget Dishwashers Under 20000: తక్కువ బడ్జెట్‌లో.. ట్రెండింగ్ డిష్ వాషర్లు.. ఫీచర్లు, లాభాలు ఇవే!

Budget Dishwashers Under 20000: తక్కువ బడ్జెట్‌లో.. ట్రెండింగ్ డిష్ వాషర్లు.. ఫీచర్లు, లాభాలు ఇవే!
Advertisement

Budget Dishwashers: సాధారణంగా డిష్ వాషర్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అధునాతన ఫీచర్లు, మెరుగైన సామర్థ్యం ఉన్న దానిని పొందాలంటే రూ.30,000-50,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. అయితే సామాన్యులను దృష్టింలో ఉంచుకొని కొన్ని కంపెనీలు తక్కువ బడ్జెట్ లో డిష్ వాషర్లను అందుబాటులో తీసుకొచ్చాయి. రూ.15,000-20,000 మధ్య వాటి ధరను నిర్ణయించాయి. ఈ బడ్జెట్ లో ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న టాప్ – 5 డిష్ వాషర్లు, వాటి ఫీచర్లు ఇప్పుడు పరిశీలిద్దాం.

Voltas Beko (DT8B/DT8S)

టాటా యాజమాన్యంలోని ఈ బ్రాండ్ మధ్యతరగతి గత కొన్నేళ్లుగా మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో వోల్టాస్ కంపెనీకి చెందిన Voltas Beko (DT8B/DT8S) డిష్ వాషర్ వినియోగదారుల నుంచి సంతృప్తికరమైన రివ్యూను పొందుతోంది. ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్, ఇన్-బిల్ట్ హీటర్, డీప్ క్లీనింగ్ కోసం 70 డిగ్రీల వేడి నీటి సదుపాయం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ. 16,990కి ఇది అందుబాటులో ఉంది.

Midea (Torrino WQP12)

Advertisement

బడ్జెట్ ధరలో పెద్ద గిన్నెలు పట్టేలా ఎక్కువ ప్లేస్ సెట్టింగ్‌లు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. 13 ప్లేస్ సెట్టింగ్స్, Intensive Kadhai Wash మోడ్, 7 వాష్ ప్రోగ్రామ్స్, హాఫ్ లోడ్ ఆప్షన్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. పెద్ద కుటుంబాలకు సైతం ఇది అనువైనదిగా ఉంటుంది. మార్కెట్ లో రూ. 19,000 – 20,000 మధ్య ఈ వాష్ డిషర్ అందుబాటులో ఉంది.

Amazon Basics (ABDW2021002)

అమెజాన్ బ్రాండ్ నుండి వస్తున్న ఈ మోడల్ చాలా తక్కువ ధరకే ఆన్ లైన్ లో లభిస్తోంది. 6 వాష్ ప్రోగ్రామ్స్, అతి తక్కువ శబ్దం (49 dB), నీటి పొదుపు (ఒక వాష్‌కు 8 లీటర్లు) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 13,000-16,000 మధ్య పలుకుతోంది. ఇందులోని యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్ వ్యవస్థ.. వినియోగాన్ని మరింత తేలికగా మార్చేస్తుంది.

Godrej Eon (DWT EON MGNS 8C)

Advertisement

గోద్రెజ్ తన ‘Eon’ సిరీస్‌లో తక్కువ బడ్జెట్ డిష్ వాషర్ ను అందుబాటులో ఉంచింది. యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్, సైలెంట్ వాష్, ఇంటీరియర్ లైటింగ్, 7 వాష్ ప్రోగ్రామ్స్ ఇందులో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. గిన్నెలపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడానికి, వాసన రాకుండా ఉండటానికి ఇందులో ప్రత్యేక ఫిల్టర్స్ ఉన్నాయి. మార్కెట్ లో రూ. 18,000-20,000 మధ్య ఈ డిష్ వాషర్ సేల్ అవుతోంది.

Also Read: Best Dishwasher Brands: కొత్త డిష్ వాషర్ కావాలా? ట్రెండింగ్ మోడల్స్ ఇవే.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Faber (FFSD 6PR 8S ACE)

ఫేబర్ కంపెనీకి కిచెన్ వస్తువుల విషయంలో మంచి పేరుంది. ఈ కంపెనీకి చెందిన డిష్ వాషర్లు మన్నిక గలవని చెబుతుంటారు. AmazonBasics (ABDW2021002 ఫీచర్ల విషయానికి వస్తే.. 6 వాష్ ప్రోగ్రామ్స్, ఎకో వాష్ (నీరు, కరెంటు ఆదా ), గ్లాస్ కేర్ ఆప్షన్ కలిగి ఉంది. సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ సైతం దీనిలో ఉంది. ఫలితంగా దీర్ఘకాలంలో దీనిని సులభంగా వినియోగించుకోవచ్చు. మార్కెట్ లో ఈ డిష్ వాషర్ రూ. 19,000 – 20,000 పలుకుతోంది.

Also Read: Dishwasher Benefits: అంట్లు తోమలేకపోతున్నారా? డిష్ వాషర్ కొనేయండి.. బోలెడన్ని ప్రయోజనాలు!

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×