E-Paper
Advertisement

Ustaad Bhagath Singh Collections : దారుణంగా పడిపోయిన ‘ ఉస్తాద్ ‘ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే..!

Ustaad Bhagath Singh Collections : దారుణంగా పడిపోయిన ‘ ఉస్తాద్ ‘ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే..!
Advertisement

Ustaad Bhagath Singh Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఇటీవల ఉగాది సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఏ మూవీకి దురంధర్ 2 షాకిచ్చింది.. ఎక్కువ మంది బాలీవుడ్ మూవీని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో ఉస్తాద్ కలెక్షన్స్ కు గండి పడింది.. అనుకున్న దానికన్నా తక్కువగా కలెక్షన్స్ రావడంతో నష్టాలు తప్పేలా కనిపించలేదు.. మొదటి రెండు రోజులు డల్ గా ఉన్నా కూడా వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని అందరు అనుకున్నారు. కానీ కలెక్షన్స్ పెరగలేదు. ఈ మూడు రోజులకు గాను ఉస్తాద్ వసూళ్లు ఎన్ని కోట్లో ఒకసారి చూసేద్దాం..

‘ఉస్తాద్’ మూవీ వసూళ్లు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. పవర్ ఫుల్ స్టోరీ తో రావడంతో ఆయన సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలలో కేవలం ఓజీ మూవీ మాత్రమే భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయిందని తెలుస్తుంది. తొలిరోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 44 కోట్ల రూపాయల నెట్.. 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసింది. మూడో రోజు మాత్రం కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 32 లక్షల షేర్ ను వసూల్ చేసింది. టోటల్ గా 2.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగుతే డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భారీగా నష్టపోయే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వీకెండు కలెక్షన్లు కాస్త పెరుగుతాయేమో చూడాలి..

Advertisement

Also Read : అట్లీ – అల్లు అర్జున్ మూవీలో మరో హీరోయిన్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ బడ్జెట్ & టార్గెట్.. 

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం అన్నీ కలిపి ఈ మూవీ బడ్జెట్ 150 కోట్ల బడ్జెట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉస్తాద్‌కు ఓ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఏపీలో థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు, సీడెడ్ లో 16 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ హిట్ అవ్వాలంటే 140 కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వాలి. అలాగే 280 కోట్ల గ్రాస్ కలెక్షన్ లని వసూలు చేయాలి. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి మరోవారం కొనసాగితే మాత్రం తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆలోపు సినిమాకి ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి..

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×