E-Paper
Advertisement

Iran strikes Israel Nuclear Site: ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. అణు కేంద్రంపై ఇరాన్ దాడులు, 100 మందికి పైగా

Iran strikes Israel Nuclear Site: ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. అణు కేంద్రంపై ఇరాన్ దాడులు, 100 మందికి పైగా
Advertisement

Iran strikes Israel Nuclear Site: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకూ  తీవ్రమవుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ సెంటర్‌పై ఇరాన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.

ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్.. అణు కేంద్రంపై ఇరాన్ దాడులు

Advertisement

ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం ఇరాన్ న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఫలితంగా ఆ కేంద్రం డ్యామేజ్ అయ్యింది. కాకపోతే రేడియన్ లీక్ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది ఇరాన్. బాలిస్టిక్‌ క్షిపణులతో డిమోనా సిటీపై వరుసగా దాడులు చేసింది.

ఇజ్రాయెల్‌కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా దాడులు చేసింది. అణు కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడడంతో ఇజ్రాయెల్ షాకైంది. అణు కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఆ దేశ వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు.

Advertisement

100 మందికి పైగా గాయాలు.. పగ తీర్చుకుంటామన్న ఇజ్రాయెల్ ప్రధాని

ఇరాన్‌ నుంచి మధ్యరకానికి చెందిన రెండు బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలు విఫలమైంది. ఈ క్రమంలో అరాద్‌, డెమోనా సిటీల్లో నివాస ప్రాంతాలపై క్షిపణులు దూసుకొచ్చాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీ భవనాలు ధ్వంసమయ్యాయి.

ఒక్క అరాద్‌ దాడిలో దాదాపు 88 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. దెబ్బతిన్న భవనాల నుంచి వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ సిబ్బంది. ఈ దాడుల్లో పలువురు మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది.

ఇజ్రాయెల్‌‌ అణు కేంద్రమైన డిమోనా సిటీపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ మధ్యశ్రేణి క్షిపణిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐడీఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. తాజా దాడులను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు, బదులు తీర్చుకుంటామని పేర్కొన్నారు.

ALSO READ: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. కేవలం 48 గంటలు

డిమోనా సమీపంలోని నెగెవ్ ఎడారిలో భారీ భద్రత గల షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం ఉంది. అందులో అణు రియాక్టర్ ఉన్నప్పటికీ ఈ కేంద్రం వాణిజ్య విద్యుత్ కేంద్రం కాదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ అప్రకటిత అణు ఆయుధ కార్యక్రమానికి ప్రధాన కేంద్రమని అంతర్జాతీయ నిపుణులు విశ్వసిస్తున్నారు.

ఇరాన్ గడిచిన 21 రోజుల్లో ఇజ్రాయెల్‌పై 70 సార్లు దాడులు చేసింది. 1948 తర్వాత డిమోనాపై జరిగిన మొదటి దాడి ఇదే. Dimona అనేది షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధన కేంద్రం. అక్కడే ఇజ్రాయెల్ తన అణు ఆయుధాలను తయారు చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. 1973లో ఈజిప్టు, 1991లో ఇరాక్ వంటి దేశాలు ఇప్పటివరకు దీనిపై దాడి చేసిన సందర్భం లేదు.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×