E-Paper
Advertisement

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ మామూలుగా లేదుగా.. ఫ్యాన్స్‌కు పండగే..

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ మామూలుగా లేదుగా.. ఫ్యాన్స్‌కు పండగే..
Advertisement

Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి సెన్సార్ వర్గాల నుండి అత్యంత సానుకూల స్పందన వినిపిస్తోంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు, ఇదొక పక్కా మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రశంసించినట్లు సమాచారం. ముఖ్యంగా హరీష్ శంకర్ తన మార్క్ ఎలివేషన్లతో పవన్ కళ్యాణ్‌లోని పవర్‌ఫుల్ మేనరిజమ్స్‌ను, డైలాగ్ డెలివరీని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారని, అభిమానులకు ఇది ఒక ఐ-ఫీస్ట్ లాంటి సినిమా అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒక సారి బ్లాక్ బాస్టర్ వచ్చిన కాంబో మరోసారి జతకట్టడంతో అందరూ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా హరీష్ టేకింగ్ కూడా ఉండటంతో సెన్సార్ చూసిన బోర్డు సభ్యులు బ్లాక్ బాస్టర్ అని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Trisha-Vijay: త్రిష బై సెక్సువల్.. సంచలన కామెంట్లు చేసిన స్టార్ సింగర్!

Advertisement

సినిమా కథనం విషయానికొస్తే, ఫస్టాఫ్ అంతా ఎనర్జిటిక్ కామెడీ మరియు స్టైలిష్ యాక్షన్ సీన్లతో చాలా వేగంగా సాగిపోతుందట. సినిమాకే హైలైట్‌గా నిలిచే ‘బంగర్’ లాంటి ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే, కథలో వేగం పెరగడమే కాకుండా పవర్‌ఫుల్ సామాజిక అంశాలు మరియు ఎమోషనల్ డ్రామాతో సినిమా గ్రిప్పింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. కేవలం మాస్ ప్రేక్షకులే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా సెంటిమెంట్ సీన్లను హరీష్ శంకర్ జాగ్రత్తగా డిజైన్ చేశారని సమాచారం.

Read also-Kavya Kalyan Ram: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ‘బలగం’ నటి కావ్య కళ్యాణ్‌రామ్?.. ఎవరితోనంటే?

Advertisement

సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో రూపొందిందని, ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, థమన్ అందిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తానికి సెన్సార్ నుంచి అందుతున్న ఈ పాజిటివ్ రిపోర్ట్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులోనూ ఇద్దరు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకులు కూడా ఈ సినిమా కోసం పని చేయడంలో అభిమానులు ఈ సినిమాపై అంచనాలు భారీ గానే పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×