E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 12th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను చంపేసిన జ్యోత్స్న 

Karthika Deepam 2 Serial Today march 12th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను చంపేసిన జ్యోత్స్న 
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

అందరూ హాస్పిటల్‌ లో ఉండగానే.. డాక్టర్‌ దీపకు టెస్టులు చేయించి రిపోర్ట్స్‌ తర్వాత వస్తాయని చెప్తుంది. దీంతో కార్తీక్‌, దీప వెళ్ళబోతుంటే..  జ్యోత్స్న రిపోర్ట్స్‌ వచ్చే వరకు ఆగండి ఎవ్వరూ ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని చెప్తుంది. దీంతో శివనారాయణ కూడా జ్యోత్స్న చెప్పిందే నిజం.. ఎవ్వరూ వెళ్లోద్దు అంటాడు. దీంతో దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు.

ఇక కావేరి ఇంట్లో ఒక్కరికే మాత్రమే వంట చేశానని స్వప్నకు చెప్తుంది. దీంతో స్వప్న కోపంగా అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటున్నావా? అని కోప్పడుతుంది. అప్పుడే దాస్ వస్తాడు. ఆయన్ని చూసి ఇద్దరూ ఏమీ మాట్లాడరు.. దాసే తాను తన కోడలి కోసం వచ్చానని చెప్తాడు. ఆ మాట వినగానే స్వప్న కోప్పడుతుంది. తాను దాస్‌ కోడలిని కాదని చెప్తుంది. అయితే దాస్‌ మాత్రం స్వప్నకు ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమని చెప్తాడు. తర్వాత కాశీకి ప్రసాదం పెడతాడు. ఈరోజు మీ పెళ్లి రోజు అందుకే గుడిలో అర్చన చేయించాను అంటాడు. ఆ మాటకు స్వప్న, కాశీ షాక్‌ అవుతారు. ఆరోజు మీరు అమర ప్రేమికులు.. ఈరోజు విడిపోయిన దంపతులు. మీలాంటి వారిని చూసినప్పుడే పెద్దవాళ్లు భయపడేది అంటూ బాధపడతాడు దాస్‌.

Advertisement

కార్తీక్‌, దీపతో సహా అందరూ హాస్పిటల్‌ నుంచి ఇంటికి వస్తారు. అందరిని చూసిన దశరథ షాక్‌ అవుతాడు. మీరు గుడికి వెళ్లలేదా..? అని అడగ్గానే.. గుడికి కాదు హాస్పిటల్ కు వెళ్లామని కాంచన చెప్పగానే.. మరి దీపను ఇంటికి తీసుకొచ్చారేంటి..? అని దశరథ అడగ్గానే.. నిజం తెలుసుకోవడానికి తీసుకొచ్చాం అంటాడు శివన్నారాయణ. దీంతో దశరథ షాక్ అవుతాడు. అందరినీ దశరథ తిడతాడు. దీంతో శివనారాయణ కోపంగా దశరథను తిడతాడు. ఇంతలో అసలు దీపని, కార్తీక్ ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడని శ్రీధర్ ప్రశ్నించడంతో దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకి ప్రమాదం ఉందట అందుకే చేర్పించాడు అంటాడు దశరథ. దీంతో ఈ విషయం నీకెలా తెలుసు అంటూ దశరథను ప్రశ్నిస్తుంది జ్యోత్స్న..

దీంతో దశరథ ఆలోచిస్తుంటాడు.  వీళ్లందరికీ ఈ అనుమానం ఎందుకు వచ్చింది? వీరిని ఎవరు రెచ్చగొట్టారు?  జ్యోత్సే ఈ పని చేసిందా.? అని మనసులో అనుమానిస్తుంటాడు. అప్పుడే డాక్టర్  ఫోన్ చేసి దీప కడుపులోని బిడ్డ వల్ల దీపకి ప్రాబ్లమ్ ఉందని చెప్పింది ఎవరు? అదంతా అబద్దం ఎవరో ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు.. తల్లీ బిడ్డా ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.. దీపకి కానీ, తన బిడ్డకి కానీ ఏ ప్రమాదం లేదు అంటూ డాక్టర్‌ చెప్పగానే..  అందరూ షాక్ అవుతారు. దీపకు కడుపులో బిడ్డకి ప్రమాదం లేనప్పుడు ఎందుకు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు.. ఎందుకు ఇంత నాటకం ఆడారు అంటూ శివనారాయణ కార్తీక్ ను నిలదీస్తాడు. అందరూ దీప, కార్తీక్‌ లను తిడుతుంటారు. అప్పుడే దశరథ వాడి వ్యక్తిగత జీవితం మీద మీ అధికారం అంటూ అందరినీ తిడతాడు..

Advertisement

అయితే దీప స్థానంలో నీ కూతురే ఉండి ఇలాంటి పని చేస్తే నీకు ఆ బాధ తెలిసుండేది అంటూ శివన్నారాయణ, దశరథను తిడతాడు. దీంతో అందరి ముందు నిజం చెప్తాడు.. దీప కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉందన్నది నిజం.. అది నా భార్య వల్లేనని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీ వదిన ప్రాణాలతో ఉండాలంటే దీప కడుపులోని బిడ్డను త్యాగం చేయాలని కాంచనకు చెబుతాడు దశరథ. దీప ఎవరో కాదు.. సుమిత్ర కన్నకూతురు అని దశరథ నిజం చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నాకు, సుమిత్రకు పుట్టిన కూతురే దీప. జ్యోత్స్న దాస్‌ కూతురు పుట్టగానే ఆసుపత్రిలో బిడ్డల్ని మార్చేశారు. ఆ పని చేసింది మా పిన్ని అని చెప్పగానే.. పారిజాతం భయపడుతుంది. ఇంతలో నిజం తెలిసిందన్న కోపంతో జ్యోత్స్న ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలి.. అది నేనే అయ్యుండాలని దీపను గన్‌ తీసుకుని కాల్చేస్తుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×