Mouni Roy: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న మౌనీ రాయ్ (Mouni Rai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ.. బిజీగా మారింది. ఈ మధ్య ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తోనే స్టెప్ వేసే అవకాశాన్ని అందుకుంది ఈ బ్యూటీ. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. ఇక విడుదల తేదీ అనౌన్స్మెంట్ చేయడమే తరువాయి.
బ్యాక్ గ్రౌండ్ లేకుంటే అవకాశాలు రావు – మౌనీ రాయ్
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే.. బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిందే అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇదే విషయంపై మౌనీ రాయ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే మనం ఎంత పెద్ద సినిమాలో నటించినా ఉపయోగం ఉండదు. బయట వ్యక్తులకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందడుగు వేయరు. చాన్సుల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. అందుకే నేను చిన్న ఆఫర్ వచ్చినా సరే వదులుకోను. సినీ నేపథ్యం లేనప్పటికీ ఆడిషన్స్ నిర్వహించి, వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఎవరికీ అనిపించదు. నేను ఇన్ని సినిమాలలో చేశాను. ఇప్పటికీ కూడా ఆడిషన్స్ ఇస్తూనే ఉండాల్సి వస్తోంది.
బ్రహ్మాస్త్ర తర్వాత అవకాశాలు వస్తాయనుకున్నా – మౌనీ రాయ్
“ముఖ్యంగా బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత నాకు అవకాశాలు వరుసగా వస్తాయి అనుకున్నాను. అందులో నా నటన చాలా బాగుంది అని విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. పైగా నాకు అవకాశాలు వస్తాయని చాలామంది కామెంట్లు చేశారు. కానీ అలా జరగలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది విన్న చాలా మంది సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవకాశాలు రావు అని మీరంటున్నారు.. అటు బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటీనటులు కూడా.. సినిమా బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం ఒకటి రెండు సినిమాలకే పనికొస్తుందని, మిగతా సినిమాలకు తాము కూడా ఆడిషన్స్ ఇవ్వాలి అని చెబుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అవకాశాల కోసం ఇప్పుడు హీరోయిన్లు, హీరోలు పడుతున్న కష్టాలు మామూలుగా లేవని తెలుస్తోంది.
మౌనీ రాయ్ కెరియర్..
మౌనీ రాయ్ కెరియర్ విషయానికి వస్తే.. టెలివిజన్ నటీమణులలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణిగా పేరు సొంతం చేసుకుంది. నాగిన్, నాగిన్ 2 సీరియల్స్ తో తన ఇమేజ్ మరింత పెంచేసుకుంది. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2022 జనవరి 27న దుబాయ్ కి చెందిన మలయాళీ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో ఏడడుగులు వేసింది. ఇక తన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా పలువురు ప్రముఖుల చేత బిరుదులు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇంకా బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె.. ఇటు వెబ్ సిరీస్ లతో పాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది.
Also read: Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!