Weapons Movie : హారర్-మిస్టరీ సినిమాలు మనల్ని ఉత్కంఠభరితమైన ప్రపంచంలోకి తీసుకెళతాయి. భయంకరమైన సీన్స్, అతీంద్రియ ట్విస్ట్‌లు, సాధారణ పాత్రల జీవితాల్లో ఊహించని సాహసాలు కలిసి ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అందిస్తాయి. కామెడీతో పాటు భయాన్ని కలిగించే సీన్స్ ఉంటే చాలు… అలాంటి సినిమాలను ఎవరైనా ఇష్టపడతారు. కానీ ఒక్కసారి చూస్తే జీవితాంతం వెంటాడే హాంటెడ్, బ్రూటల్ హర్రర్ సీన్స్ ఉన్న ఓ మూవీ ఇప్పుడు థియేటర్లలో జనాలను పరుగులు పెట్టిస్తోంది. ఇంత భయంకరమైన మూవీ పేరేంటి? దాని కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఇంగ్లీష్ మూవీ
ఈ అమెరికన్ హారర్-మిస్టరీ సినిమా పేరు Weapons. 2025 ఆగస్టు 8న థియేటర్‌లలో విడుదలైంది. సినిమా నిడివి 2 గంటల 8 నిమిషాలు (128 నిమిషాలు) ఉంటుంది, ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇందులో జూలియా గార్నర్ (జస్టిన్), జోష్ బ్రోలిన్ (ఆర్చర్), ఆల్డెన్ ఎహ్రెన్‌రీచ్ (పాల్), ఆస్టిన్ అబ్రమ్స్ (జేమ్స్), కారీ క్రిస్టోఫర్ (అలెక్స్), బెనెడిక్ట్ వాంగ్ (మార్కస్), ఆమీ మాడిగన్ (గ్లాడిస్) తదితరులు నటించారు. జాక్ క్రెగర్ దీనికి దర్శకత్వం వహించారు.
ఇందులో అంతగా ఏముంది ?
ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఎందుకంటే ఇందులో వయొలెన్స్ తో పాటు భయంకరమైన సన్నివేశాలు, చిన్న పిల్లలు వినకూడని కొన్ని పదాలు, చూడకూడని సీన్స్, డ్రగ్ ఉపయోగం వంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఇదొక రిఫ్రెషింగ్ హారర్-మిస్టరీగా అని చెప్పొచ్చు, జూలియా గార్నర్ సహజ నటన, ఆస్టిన్ అబ్రమ్స్ కామెడీ టైమింగ్, జోష్ బ్రోలిన్ భావోద్వేగ పాత్ర, జాక్ క్రెగర్ విలక్షణమైన నాన్-లీనియర్ రచనతో సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సాంప్రదాయిక హారర్ జానర్ ఫార్మాట్ ను తిరగరాసింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా… ఈ సినిమా కామెడీ, హారర్ ను ఇష్టపడే స్నేహితులతో కలిసి చూడటానికి ఒక అద్భుతమైన ఆప్షన్. కానీ హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకపోతేనే బెటర్. ఎందుకంటే ఓటీటీలోనే ఇలాంటి సినిమాలను చూడలేము. అలాంటిది థియేటర్లలో చూస్తే హర్రర్ సినిమాలను భయపడే వారి గుండె ఆగిపోవడం ఖాయం.
Read Also : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే
కథ ఏంటంటే?
ఒక చిన్న ఊళ్లో 17 మంది పిల్లల అదృశ్యంతో మూవీ మొదలవుతుంది. సరదా సీన్స్, భయపెట్టించే హర్రర్ సీన్స్, స్నేహ బంధంతో నిండిన ఒక అసాధారణ సాహసాన్ని ఈ మూవీ చూపిస్తుంది. కథ జస్టిన్ గాండీ (జూలియా గార్నర్) అనే 30 ఏళ్ల స్కూల్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు రాత్రి 2:17 గంటలకు, జస్టిన్ టీచర్ గా పని చేస్తున్న మూడో తరగతి నుండి 17 మంది పిల్లలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి చేతులు చాచుకుని, చీకటిలోకి పరిగెత్తి అదృశ్యమవుతారు. జస్టిన్ ఈ షాకింగ్ సంఘటనతో గందరగోళంలో పడుతుంది. ఆమె తరగతిలో ఒక్క అలెక్స్ లిల్లీ (కారీ క్రిస్టోఫర్) అనే పిల్లాడు మాత్రమే మిగిలాడు. ఊరంతా జస్టిన్‌ను అనుమానిస్తుంది. అసలేం జరిగింది అన్నది తెరపై చూడాల్సిందే.