Cine Workers Strike: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో పెద్ద ఎత్తున నిర్మాతలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు అన్నీ సెట్స్ పై ఉన్న నేపథ్యంలో సినీ కార్మికులు(Cini Workers) తమకు 30% వేతనాలు పెంచకపోతే షూటింగ్స్ కు రాము అంటూ స్ట్రైక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం గురించి ఫిలిం ఛాంబర్ సభ్యులతోపాటు ఫెడరేషన్ సభ్యుల మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఏమాత్రం ఫలించలేదని తెలుస్తోంది. ఇప్పటికి కార్మికుల వేతనాల విషయంలో నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకోకపోవడం కార్మికుల డిమాండ్లను అంగీకరించకపోవడంతో కార్మికులు మరొక అడుగు ముందుకు వేశారు.
ఆమరణ దీక్షకు సిద్ధమైన కార్మికులు..
ఫిలిం ఛాంబర్ లో ఇదే విషయం గురించి కీలక సమావేశం కొనసాగుతోంది . ఇక తాము కోరిన విధంగా 30% వేతనాలు పెంచాలి అంటూ మరోవైపు కార్మికులు డిమాండ్లు చేస్తున్నారు. తమ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఆమరణ దీక్ష(Hunger Strike ) చేయడానికి తాము సిద్ధమే అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీలో ముఖ్యంగా నాలుగు అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో కొంతమంది గుట్టుగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి.
సమ్మె మరింత ఉదృతం..
ఈ క్రమంలోనే తమ అనుమతులు లేకుండా ఎవరు కూడా షూటింగ్లో నిర్వహించకూడదంట ఫిలిం ఛాంబర్ ఆదేశాలను జారీ చేసింది. కార్మికుల డిమాండ్ల విషయంలో ఛాంబర్ సరైన నిర్ణయానికి రాకపోతే రేపటి నుంచి సమ్మె మరింత ఉధృతం చేస్తాము అంటూ కార్మిక సంఘాలు డిమాండ్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఇప్పటికైనా నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకొని యధావిధిగా షూటింగ్స్ జరుపుకుంటే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని లేకపోతే అటు నిర్మాతలు నష్టపోవడమే కాకుండా కార్మికులు కూడా ఉపాధిని కోల్పోవలసి ఉంటుందని తెలుస్తోంది.
కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికేనా?
ఇక ఇప్పటికే ఈ విషయం గురించి ఎంతోమంది సినీ ప్రముకులు స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు.. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల నుంచి ఈ విధమైనటువంటి డిమాండ్లు వ్యక్తం అవుతూ ఉంటాయని తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఒక సినిమా చేయాలంటే నిర్మాతకు ఎంతో కష్టంతో కూడుకున్న పని ఇలాంటి తరుణంలోనే కార్మికులకు వేతనాలు పెంచడం అంటే మరింత భారం అవుతుందని పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అదేవిధంగా హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్ కనీసం వర్కర్లకు 30% రెమ్యూనరేషన్ పెంచలేరా అంటూ కార్మిక సంఘాలు డిమాండ్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ఎప్పుడు ఎలాంటి స్పష్టత వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా వాయిదా పడటంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తున్నాయని చెప్పాలి.
Also Read: Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!