MLA Mallareddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన కామెడీ టైమింగ్ తో సోషల్ మీడియాలో ఓ హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా ఇట్టే నవ్వులు పూయిస్తారు. తన విశిష్టమైన హాస్య శైలితో అందరినీ ఆకర్షిస్తారు. ఆయన హాస్యం, సమయస్ఫూర్తితో కూడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మాజీ మంత్రి, విద్యావేత్త, వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి తన చమత్కార వ్యాఖ్యలతో తరుచూ ట్రెండ్ అవుతుంటారు. గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ‘కష్టపడ్డా.. పాలమ్మిన.. పూలమ్మినా.. మంత్రి అయినా’ అని ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అయ్యాయి.. రాజకీయ విమర్శలతో పాటు, సినిమా ఈవెంట్‌లలో కూడా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమై, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ‘యానిమల్’ సినిమా ఈవెంట్‌లో తెలుగు వాళ్లు బాలీవుడ్‌ని ఆకర్షిస్తారని చెప్పి కాంట్రవర్సీ సృష్టించాడు.
రాజకీయమే వద్దనుకుంటున్నాను..
7 3 ఏళ్ల వయసులోనూ ఆయన రాజకీయ, విద్యా, వ్యాపార రంగాల్లో చురుకుగా ఉంటూ, తన హాస్య చతురతతో అందరినీ అలరిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బీజీపీ వైపా.. టీడీపీ వైపా… బీఆర్ఎస్ వైపా అన్నది కాదు.. రాజకీయమే వద్దనుకుంటున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్‌ను అయ్యా…
‘నేడు బీఆర్ఎస్ లోనే ఉన్నాను. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. నాకు 73 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఏవైపు చూడాల్సిన అవసరం ఏముంది..? ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అయ్యా.. ఇంకా మూడేళ్లు ఉంటాను. రాజకీయమే వదిలేద్దామని అనుకుంటున్నాను. కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దాం అనుకుంటున్నా..’ అని ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200
ALSO READ: SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..