Male River In India: భారతదేశం పుణ్యభూమి. శతాబ్దాల ఘన చరిత్రను కలిగి ఉంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, విభిన్న భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. అద్భుతమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంది. మన దేశం మూడు వైపులా సముద్రాలను కలిగి ఉంది. దేశంలో ఎన్నో నదులను కలిగి ఉంది. వాటిలో పలు జీవనదులు కూడా ఉన్నాయి. ఒక్కో నదికి ఒక్కో పేరు ఉంది. దాదాపు దేశంలోని అన్ని నదులకు స్త్రీల పేర్లే ఉన్నాయి. కానీ, ఒకే ఒక్క నదికి మగ పేరు ఉంది. ఇంతకీ ఆ నది ఏంటి? దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
దేశంలోని నదులన్నింటీకి స్త్రీల పేర్లే
మన దేశంలో నదులను దేవతలుగా భావిస్తాం. అందుకే వాటికి గంగా, యుమునా, గోదావరి, నర్మద, సింధు, తుంగభద్ర అంటూ నదులన్నింటికీ స్త్రీల పేర్లు పెట్టారు. ఈ నదులకు భారతీయ పురాణాలలో ఎంతో గొప్పగా చెప్పబడింది. నాటి నుంచి నేటి వరకు ఈ నదులను దేవతలుగా భావిస్తూ భక్తులు, పూజలు చేస్తున్నారు. నదిలో స్నానమాచరించి, ఒడ్డున పూజలు చేసేవారు. నదిలో స్నానం చేస్తే పాపాలను పోతాయని భావించేవారు. ఇప్పటికీ, ఆయా నదులకు పండితులు పూజలు చేస్తూనే ఉంటారు. పుష్కరాల వేళ ఆయా నదుల దగ్గర ఉండే భక్తజన సందోహం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
Read Also: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!
దేశంలో ఏకైన మగ నది బ్రహ్మపుత్ర!
దేశంలో అన్ని నదులకు స్త్రీ మూర్తుల పేర్లే ఉన్నా, ఒకే ఒక్క నదికి మగ పేరు ఉంది. ఆ నది మరేదో కాదు బ్రహ్మపుత్ర. ఈ నదిని బ్రహ్మదేవుడి కొడుకుగా భావిస్తారు. టిబెట్ లోని మానస సరోవరం మంచు పర్వతాల్లో పుట్టిన ఈ నదిని పవిత్ర నదిగా భావిస్తారు. సుమారు 2900 కిలో మీటర్ల మేర ప్రహిస్తుంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఈ నదిని ప్రత్యేకంగా పూజిస్తారు. దేశంలోని పలు జీవనదులు ఉండగా, అందులో ఈ నది కూడా ఒకటిగా కొనసాగుతోంది. కాలంతో సంబంధం లేకుండా ఏడాది అంతా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. మొత్తంగా దేశంలో ఉన్న ఏకైక మగ నదిగా బ్రహ్మపుత్రా నది గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?