BigTV English

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కార్మికులు (Cini Workers)30% వేతనాలు పెంచాలి అంటూ సమ్మె(Strike) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసి సమస్య గురించి వివరించినట్లు వార్తలు వచ్చాయి అలాగే కొంతమంది ఫెడరేషన్ సభ్యులు కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో ఆయన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు.


నన్ను ఎవరు కలవలేదు..

ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. “ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకొని కొంతమంది వ్యక్తులు నేను వాళ్లని కలిశానని, వారు డిమాండ్ చేస్తున్న విధంగా 30% వేతనాల పెంపు డిమాండ్లను నెరువేరుస్తానని, అదేవిధంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చాను అంటూ తప్పుడు ప్రచారాలను చేయటం నా దృష్టికి వచ్చింది. నేను ఫెడరేషన్ సభ్యులను ఎవరిని కలవలేదు. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, మొత్తం పరిశ్రమ సమస్య. నాతో సహా ఏ వ్యక్తి అయినా ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఏకపక్ష నిర్ణయాలు హామీలు ఇవ్వలేరు.ఫిలిం ఛాంబర్ మాత్రమే సంబంధిత వ్యక్తులతో ఈ సమస్య గురించి చర్చలు జరిపి సరైన పరిష్కారం చూపిస్తారని, అప్పటి వరకు ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు ప్రచారం చేయొద్దని ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరైనది కాదు అంటూ చిరంజీవి ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.


తప్పుడు వార్తలను ఖండించిన చిరు..

ఇలా మెగాస్టార్ చిరంజీవిని కలిసాము అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో ఈ వార్తలకు చిరంజీవి అడ్డుకట్టు వేశారు. మరి చిరంజీవి చేసిన ఈ పోస్టుతో ఫెడరేషన్ సభ్యులు తమ నిరసనలను మరింత ఉదృతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇప్పటికే తమ డిమాండ్లను కచ్చితంగా నెరవేర్చాలని లేకపోతే తమ నిరసనలు ఆగవని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే చిరంజీవి తనని ఎవరూ కలవలేదని తాను ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వలేదని పోస్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

మరి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ పట్ల ఫెడరేషన్ సభ్యుల స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. తమకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ కు రామని కార్మికులు తేల్చి చెబుతున్నారు. అలాగే పక్క రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకన్నా షూటింగ్స్ జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మరి ఈ సమస్యకు ఫిలిం ఛాంబర్ ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుంది? కార్మికులు అడిగిన విధంగానే 30% వేతనాలను పెంచుతారా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు చిరంజీవితో పాటు బాలకృష్ణ వంటి స్టార్ హీరోలను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.మరి ఇండస్ట్రీలో నెలకొన్న ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Cine Workers Strike : ఆమరణ దీక్షకు రెడీ… సినీ కార్మికులను ఎవరూ ఆపలేరా ?

Related News

Kantara Chapter1: ఓజీను తొక్కేసిన కాంతార… రిషబ్ కు ఉన్న క్రేజ్ పవన్ కు లేదా ?

OG Movie: వెయిట్… ప్రీమియర్స్ షో టికెట్స్ ధరలు తగ్గుతున్నాయి

Pawan Kalyan: రజినీ తరువాత పవన్ కే ఆ ఘనత.. అది ఆయన రేంజ్

Anaconda Trailer: అనకొండ మళ్లీ వస్తుంది.. ఈసారి సస్పెన్స్‌తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్‌ చూశారా?

Sonu Sood: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్… ఈడీ విచారణకు హాజరైన సోనూ సూద్

Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి అంటూ మరో ట్వీట్ వేసిన బండ్లన్న… అదే కారణమా?

Dharma Mahesh: రీతూతో రిలేషన్ ఓపెన్ అయిన ధర్మ మహేష్… నిరూపించాలంటూ ఛాలెంజ్!

Manchu Manoj: ఓజాస్ గంభీరకు బ్లాక్ స్క్వార్డ్ బెస్ట్ విషెస్..

Big Stories

×