E-Paper
Advertisement

Vanaveera film: వనవీర ప్రీ క్లైమాక్స్ లో స్టార్ హీరో క్యామియో.. ఈ ట్విస్ట్ ఏంటీ?

Vanaveera film: వనవీర ప్రీ క్లైమాక్స్ లో స్టార్ హీరో క్యామియో.. ఈ ట్విస్ట్ ఏంటీ?
Advertisement

Vanaveera film: అవినాష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వనవీర(Vanaveera). మొన్నటి వరకు వానర పేరుతో ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు కానీ ఈ సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సెన్సార్ సమస్యల కారణంగా సినిమాని ‘ వానరా’ నుంచి ‘ వనవీర’ గా మార్చారు. ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఈ సినిమా కుల రాజకీయాల అంశాలతో పాటు డివోషనల్ టచ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే రాముడు, వానర సైన్యం లంకకు సంబంధించిన విజువల్స్ చూపించడంతో ఇందులో డివోషనల్ టచ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయమవుతూ ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా విడుదలకు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

10 నిమిషాల క్యామియో..

Advertisement

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అవినాష్ వెల్లడించారు. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయం గురించి మీడియా వారు అవినాష్ ను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఈ సినిమాలో స్టార్ హీరో క్యామియో ఉన్నమాట వాస్తవమే అని తెలిపారు. స్టార్ హీరో క్యామియో ప్రీ క్లైమాక్స్ ఉంటుందని దాదాపు పది నిమిషాల పాటు తెరపై కనిపిస్తారని ఈ పది నిమిషాలలోనే టాప్ లేపి వెళ్లిపోతారు అంటూ అవినాష్ తెలిపారు.

స్టార్ హీరో క్యామియో ..

Advertisement

ఇలా ఈ సినిమాలో స్టార్ హీరో క్యామియో ఉండబోతుందనే విషయం గురించి క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు? బహుశా హనుమాన్ పాత్రలో స్టార్ హీరో క్యామియో ఉండబోతుందా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో నటించిన ఆ స్టార్ హీరో ఎవరు? అతని పాత్ర ఏంటి? అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇదివరకు వానర పేరుతో భారీగా ప్రమోషన్లను నిర్వహించిన చిత్రబృందం ప్రస్తుతం వనవీర పేరుతో ప్రమోషన్లను వేగవంతం చేశారు.

Also Read: Naa Anveshana : ‘మీది కట్ చేసుకోండి’.. శివాజీ, గరికపాటిపై బూతులతో విరుచకుపడ్డ నా అన్వేషణ

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×